అమ్మ: గర్భిణులకు ఈ విటమిన్స్ చాలా అవసరం..!

N.ANJI
గర్భధారణ సమయంలో గర్భిణులకు పోషకాలు, విటమిన్స్ చాలా అవసరం. ఇక వైద్యులు గర్భిణులకు పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. అయితే ప్రెగ్నెసీ సమయంలో గర్భిణులకు ఏ విటమిన్స్ చాలా అవసరం. ఇక ఏ ఆహారం తీసుకంటే విటమిన్లు అందుతాయో ఒక్కసారి చూద్దామా.
గర్భిణులకు విటమిన్ ఏ చాలా అవసరం. విటమిన్ ఏ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలు, కళ్లు, ఎముకల ఎదుగుదలకు నాడీ వ్యవస్థ నిర్మాణం, ఆరోగ్యవంతమైన చర్మం, రక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతుంది. ఇది ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణని కలిపిస్తుంది. అయితే డెలివరీ తర్వాత కూడా శరీర నిర్మాణం కుదురుకునేందుకు విటమిన్ ఏ అవసరం ఉంటుంది. విటమిన్ ఏ క్యారెట్లు, స్వీట్ పొటాటో, ఎండిన యాప్రికాట్ పండ్లు, టమాటా, పీచ్, గుడ్డులోని పచ్చసొనలో సమృద్ధిగా లభిస్తుంది. ఇక తల్లీ, బిడ్డ ఇద్దరికీ విటమిన్ ఏ ఎంతగానో దోహదపడుతుంది.
విటమిన్ సిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అయితే గర్భిణులకు ఇన్ఫెక్షన్ల ముప్పు ఉంటుంది. ఇక వాటి నుండి రక్షణ కోసం గాను రోజూ విటమిన్ సిని తగినంత ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాక.. ణజాల మరమ్మతుల కోసం, గాయాలు మానేందుకు, ఎముకల వృద్ధికి, ఐరన్ ను శరీరం గ్రహించేందుకు విటమిన్ సి చాలా అవసరం. విటమిన్ సి కమలా, నారింజ రసంలో, కివి పండ్లు, గ్రాక్ష, స్ట్రాబెర్రీ, క్యాబేజ్, స్వీట్ పొటాటోలో, ఉసిరిలో సమృద్ధిగా లభిస్తుంది. ఇక విటమిన్ సీ లోపిస్తే మానసిక ఎదుగుదల తగ్గిపోతుందన్నారు.
సాధారణంగా విటమిన్ డి చాలా అవసరం. అయితే విటమిన్ డి శరీరంలో క్యాల్షియం, ఫాస్ఫరస్ నిష్పత్తి తగినంత ఉండేలా చూస్తుంది. అంతేకాదు.. శరీరం క్యాల్షియం సరిగా గ్రహించాలంటే అందుకు విటమిన్ డి అవసరం ఉంటుంది. విటమిన్ డి తక్కువగా ఉంటె రికెట్స్ వ్యాధి వస్తుంది. ఇక రోజూ సూర్యోదయం తర్వాత, సూర్యాస్తమయం ముందు అరగంటపాటు సూర్యరశ్మి పడేలా చూసుకుంటే తగినంత విటమిన్ డి దొరుకుతుంది. అంతేకాదు.. గుడ్డులోని పచ్చసొన, తృణధాన్యాలు, చేపల్లోనూ ఇది లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: