అమ్మ: గర్భిణులు ఒత్తిడి నివారణకు ఇలా చేయండి..?

N.ANJI
గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కడుపులో బిడ్డ వూపిరి పోసుకొంటుందన్న విషయం తెలిసిన నాటి నుంచి ఆమె చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు.. కడుపులో బిడ్డ వూపిరి పోసుకొంటుందన్న విషయం తెలిసిన నాటి నుంచి ఆమె చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. గర్భిణులు తీసుకునే ఆహారం, వారు చేసే పనుల మీదే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. గర్భిణులకు అన్ని విషయాలు తెలుసు అని అనుకుంటారు. కానీ.. గర్భిణిగా ఉన్న మహిళ కొన్ని విషయాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ముఖ్యంగా ట్రైమిస్టర్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.
అంతేకాదు.. బిడ్డ ఎదుగుదల ఆధారంగా తొమ్మిది నెలల కాలాన్ని మూడు ట్రైమిస్టర్స్‌గా విభజిస్తారు. ఇక గర్భిణులు, గర్భం దాల్చాలనే ఆలోచన ఉన్నవారు వీటి గురించి అవగాహన పెంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే గర్భధారణ సమయంలో మనకు ఎదురయ్యే ఇబ్బందులను యోగా సాయంతో రాకుండా చూసుకోవచ్చునని అన్నారు. ఇక గర్భిణులు సమయంలో తేలికపాటి వ్యాయామాలతో పాటు యోగా చేయమని వైద్యులు సూచించారు. ఇక మీరు ఎలాంటి ఆసనాలు వేయవచ్చో వైద్యులను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
అయితే ముందుగా యోగా చేయడానికి అనువైన స్థలాన్ని ఎంచుకోవాలన్నారు. గర్భిణులు గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోవాలని అన్నారు. ఇక దీనికోసం గార్డెన్ లేదా టెర్రస్ అయితే బాగుంటుందని అన్నారు. అయితే మీకు కావాలనుకొంటే..  అక్కడక్కడ పూల కుండీలను పెట్టుకోవాలన్నారు. అంతేకాదు.. యోగా మ్యాట్‌తో పాటు వాటర్ బాటిల్, ఫేస్ టవల్ అందుబాటులో ఉంచుకునేలా చూసుకోవాలని అన్నారు.
అంతేకాదు.. మనసుకి హాయినిచ్చే సంగీతాన్ని ప్లే చేస్తే మీ మూడ్ హాయిగా చేంజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక యోగా మ్యాట్‌ను నేలపై పరిచి దానిపై సుఖాసీనులవ్వండి. ఐదు నుంచి పది సార్లు మెల్లగా గాలి పీల్చి వదలాలి అని తెలిపారు. ఇక మీ కాళ్లను, చేతులను మెల్లగా కదిలిస్తూ ఆసనాలు వేయడానికి సన్నద్ధులు చేయాలనీ అన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: