అమ్మ: గర్భిణీ బ్లడ్ ప్రెజర్ ను చూసి ఆడ, మగ తెలుసుకోవచ్చు..!

N.ANJI
బిడ్డకు జన్మనివ్వాలని ప్రతిమహిళ ఎన్నో కలలుకంటుంది. ఇక గర్భం దాల్చినప్పడి నుండి ప్రసవం అయ్యేవరకు పుట్టేది ఆడపిల్లనా, మగ పిల్లనా అన్ని ఆలోచిస్తుంటారు. మరికొంతమంది కడుపు పెద్దగా, చిన్నగా చూసి పుట్టబోయేది చెబుతుంటారు. అయితే ప్రగ్నన్సీ సమయంలో కడుపులోని బిడ్డ ఎవరు అనేది మన పెద్దలు కొన్ని సంవత్సరాల నుండి ఫాలో అవుతున్న విషయమే.
ఇక గర్భం సైజును బట్టి, స్వీట్స్ ఎక్కువగా  తింటుంటే, నిద్రించే పొజిషన్, చర్మ కాంతి..ఇలా ఎన్నో పరీక్షల ద్వారా పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అనేది  తెలుసుకునేవారు.  ఐతే ప్రగ్నన్సీ మహిళ యొక్క బ్లడ్ ప్రెజర్ (రక్తపోటు)ను బట్టి మీ ఇంట్లోకి అబ్బాయి వస్తున్నాడా, అమ్మాయి రాబోతోందా అనేది తెలుసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అయితే గర్భంతో ఉన్నప్పుడు వివిధ పరీక్షలు చేసి ఆడ, మగ అనేది తెలుసుకున్నట్లుగానే, ఆ మహిళ బ్లడ్ ప్రెజర్ ను బట్టి కూడా తెలుసుకోవచ్చని కొన్ని దేశాలలో రీసెంట్ గా కొన్నివేల గర్భిణీ మహిళల రక్తపోటును బట్టి తెలుసుకున్నారట. 26 వారాలు లేదా ఆ తర్వాత ప్రగ్నన్సీ మహిళ బ్లడ్ ప్రెజర్ 106 (mmHg) ఉంటే అబ్బాయి పుట్టబోతున్నట్లు, అదే అమ్మాయి పుట్టబోతుంటే 103 (mmHg) రక్తపోటు ఉన్నట్లుగా ఈ పరిశోధనలో తేలిన విషయం. ఆ మహిళలు బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత చూస్తే ఇది నిజం అయ్యిందని తెలిపారు.
ఇక సాధారణంగా గర్భం దాల్చిన మహిళ కడుపులో ఉన్న శిశువు మగ లేదా ఆడ బిడ్డ అనేది 19 లేదా 20 వ వారంలో తెలుస్తుంది. కడుపులోని బిడ్డ ఆరవ వారం నుండి ఎదుగుదల, అవయవాలలో చిన్న చిన్న మార్పులు వస్తుంటాయి. 9 వ వారంలో మగ, ఆడ లింగ నిర్ధారణ అవయవాలు అభివృద్ధి జరుగుతుంది. 20 వ వారానికి వచ్చేసరికి పూర్తిగా వారి  లింగ నిర్ధారణకు సంబంధించిన అవయవాలు ఏర్పడటం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: