బోయింగ్ 777 విమానాన్ని 17 గంటల పాటు నడిపిన పిన్న వయస్కురాలు జోయా

Mamatha Reddy
ఆమె అతి చిన్న వయసులో బోయింగ్ 777 విమానాన్ని నడిపింది. తోడుగా నలుగురు మహిళా కెప్టెన్ల ని తీసుకుని కమాండింగ్ ఆఫీసర్ గా ఇండియా సర్వ మహిళా సిబ్బంది విమానాన్ని 17 గంటల పాటు ఎగరేసి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఉత్తర ధ్రువం మీదుగా బెంగళూరు చేరుకుంది. ఇంతకాలం జోయా అగర్వాల్ ఘనతలు తెలుసు. ఆమె జీవితం తెలియదు.. పైలెట్ కావడానికి ఎంత స్ట్రగుల్ చేయవలసి వచ్చిందో చెప్పి ఎనిమిదేళ్ల వయసులోనే నేను ఈ కలని కనీ సాధించుకున్నాను అందామె..
కోవిడ్ మొదలయ్యాక ప్రభుత్వం తలపెట్టిన వందే భారత్ మిషన్ లో ఒక మహిళా పైలెట్ పాల్గొని ఎయిర్ ఇండియా విమానాలు ఎగిరేసి  12 దేశాల నుంచి అరవై నాలుగు ట్రిప్పులు వేసి దాదాపు 15 వేల మంది భారతీయులను స్వదేశానికి చేర్చింది. ఆకాశంలో ఎగిరే విమానాన్ని అందరూ చూస్తారు కానీ ఆ విమానం వీపును ఎక్కి ప్రపంచాన్ని చుట్టాలని అనుకునే వారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ఒకరైన ఢిల్లీకి చెందిన జోయ చిన్నప్పుడు ఆకాశంలో ఎగిరే విమానాలు చూసేది. చూడడమే కాదు.. నడపాలని కలలు కన్నది.. అప్పుడు ఎనిమిది ఏళ్ళ వయస్సు ఆమెకు.
ఆ విమానంలో నేను ఉంటే చుక్కలు చుట్టెద్దును కదా అని అనుకొనేది. ఆ సమయంలో దూరదర్శన్ లో రాజీవ్ గాంధీ కనిపించేవారు. ఎవరి మాటల్లోనో రాజీవ్ గాంధీ గతంలో పైలెట్ గా పని చేశారని వినపడగా అప్పుడు తను కూడా పైలెట్ కావాలని అనుకుంది. పైలెట్ చదువు పూర్తయ్యాక రెండేళ్లు ఖాళీగా ఉన్న జొయా ఎయిర్ ఇండియాలో ఏడు పైలెట్ పోస్టులు పడ్డాయి అని తెలిసి ఎగిరి గంతేసింది. అయితే ఆ పోస్టుల కోసం మూడు వేల మంది దరఖాస్తు చేశారని తెలిసి కంగారుపడినా పట్టుదలగా ప్రయత్నించింది. అదే సమయంలో తండ్రి హార్ట్ ఎటాక్ వచ్చింది. తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఆమె ఆ జాబ్ తెచ్చుకోగలిగింది. ఆ తర్వాత ఆమె సాధించిన ఘనతలు అందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: