భారీ వాహనాలు నడుపుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న పాతికేళ్ల అమ్మాయి..!!

Mamatha Reddy
ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆడవారు మగవారి కన్నా దేనికి తీసుపోవట్లేదు.. మగవారు చేసే పనిని ఆడవారు సైతం సమానంగా చేస్తూ మగవారిని ఆశ్చర్యపడుతున్నారు.. అమ్మాయిలు కూడా వాహనాలు నడిపిస్తూ తమ జీవనోపాధిని ఏర్పరచుకుంటున్నారు.. బైకులే కాదు కార్లు పెద్ద ట్రక్కులు , బస్సులు కూడా నడుపుతూ ఎంతో ఈజీ గా హెవీ కమర్షియల్ వెహికల్స్ ని నడిపి చూపిస్తున్నారు.. అలా మహారాష్ట్రలోని మలడ్ లో ఉనన ఠాకూర్ కాలేజీలో చదువుతున్న ప్రతీక్ష దాస్ ఓ ట్రెండ్ ని సృష్టించింది.. ముంబై లో తొలి మహిళా బస్సు డ్రైవర్ గా ఘనత సాధించింది..
బృహన్ ముంబాయి ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్ పోర్ట్ లో బస్సు డ్రైవర్ గా అపాయింట్ అయింది ప్రతీక్షా.. ఈమె వయసు 25 ఏళ్లే.. ఈ అమ్మాయి చూడడానికి చాలా జాలిగా కనిపిస్తుంది.. ఫ్రెండ్స్ తో సినిమాకు, సెలవులకు వెళ్లేలా కనిపిస్తుంది.. కానీ పెద్ద వాహనం నడిపే సత్తా ఉందని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోక మానరు.. నాకు హెవీ వెహికల్స్ అంటే చాలా ఇష్టం.. భారీ వాహనాలను నడపాలని ఎప్పటినుంచో కోరిక..  దీనికోసం గత ఆరేళ్లుగా పనిచేస్తున్నాను..ముందుగా బైకులు నడిపాను.. తర్వాత పెద్ద పెద్ద కార్లు నడిపాను.. ఇప్పుడు బస్సులు,ట్రక్కులు నడుపుతున్నాను.. నాకు చాలా ఆనందంగా ఉంది.. అని ప్రతిక్ష తన ఎక్స్పీరియన్స్ అని చెప్తుంది..
ఆర్టీవో ఆఫీసర్ అవ్వాలని ప్రతీక్ష అనుకుంది అయితే హెవీ వెహికల్స్ నడిపే డ్రైవింగ్ లైసెన్స్ ఇందుకు అవసరం.. ఆ జాబ్ తనకు పర్ఫెక్ట్ అని అనుకుంది.  ఎందుకంటే బస్సులు నడపడమంటే తనకు చాలా ఇష్టం..  ఎనిమిదో క్లాస్ లో ఉన్నప్పుడు తన మామ మోటార్ సైకిల్ నడిపింది.. ఇది చూసి ఆమె మామ ఆశ్చర్యపోయాడు.. రెండు రోజుల్లో మోటార్ సైకిల్ నడపడం ఎలా నేర్చుకున్నావు అని అడిగాడు.. ఫాస్ట్ లెర్నర్ గా ప్రత్యేక గుర్తింపు పొందింది ప్రతీక్ష.. అయితే తనకు బస్సు ట్రైనింగ్ ఇచ్చే ట్రైనర్ ఆమె ఎత్తు ని చూసి చాలా భయపడ్డాడు..  నువ్వు చాలా పొట్టి గా ఉన్నావు బస్సు నడపగలవా అని ప్రశ్నించాడట.. అందుకు తాను అన్ని రకాల బైక్లు నడపగలను అని ఆమె బదులిచ్చింది అట.. పదిహేను రోజుల్లోనే ఆమె 36 ఫీట్ పొడవున బస్సు ను ఎలా నడపాలి అనే ట్రైనింగ్ తీసుకుని రికార్డు సృష్టించింది.. ప్రస్తుతం ఆమె ట్రైనర్ లు ఆమె డ్రైవింగ్ పట్ల ఎంతో హ్యాపీగా ఉన్నారట..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: