అటిజంలో స‌మ‌స్య‌ను గుర్తించిన‌ప్పుడే స‌గం విజ‌యం... శ్రీజా రెడ్డి స‌క్సెస్ ఇదే ?

Mamatha Reddy
స‌మాజంలో సేవ చేయ‌డం అనేది  ఒక ఆర్ట్‌! ఇది అంద‌రికీ అబ్బేది కాదు. `సేవ చేసేందుకు ముందుకు వ‌చ్చాం` అని చెప్పుకొనే వారు చాలా మంది ఉన్న‌ప్ప‌టికీ.. నిజ‌మైన సేవ చేసేవారు.. చేసిన సేవ నుంచి ఏమీ ఆశించ‌ని వారు చాలా చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి వారిలో పినాకిల్ బ్లూమ్స్ వ్య‌వ‌స్థాప‌కు రాలు.. స‌రిప‌ల్లి శ్రీజారెడ్డి ముందున్నారు. త‌ను అనుభ‌వించిన క‌ష్టం మ‌రో మాతృమూర్తికి రాకూడ‌ద‌నే ఉద్దేశంతో.. ఆమె ప‌డిన త‌ప‌న‌.. ఈ క్ర‌మంలో చేసిన సేవ‌.. న‌భూతో.. అన్న‌విధంగా సాగింద‌నే చెప్పాలి.
బుద్ధిమాంద్యం (ఆటిజం) తో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు ఆశాకిర‌ణంగా మారారు శ్రీజారెడ్డి. చిన్న‌వ‌య‌సు లోనే చిన్నారుల్లో తెలెత్తే.. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపించేందుకు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డ్డారు. ఈక్ర‌మంలో నే హైద‌రాబాద్ కేంద్రం పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌స్తుతం ప‌ద‌కొండు బ్రాంచులు స‌హా ఏపీలోనూ శాఖ‌ల‌ను ఏర్పాటు చేశారు. దీనిద్వారా.. ఆటిజం చిన్నారుల‌కు సేవ‌లు చేరువ చేశారు. చిన్నారుల‌ను ఆడించ‌డం, వారికి స్పీచ్ థెర‌పీ ఇవ్వ‌డం ద్వారా.. ఆ కేంద్రాల్లో శిక్ష‌ణ ఉంటుంది.
ప్ర‌ధానంగా ఆటిజం అనేది సుదీర్ఘ స‌మ‌స్య‌. ఎప్పుడు ప‌రిష్కారం అవుతుందో చెప్ప‌డం కూడా క‌ష్ట‌మే. అంతేకాదు.. దీనిని చిన్న‌వ‌య‌సులోనే గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటారు.. శ్రీజారెడ్డి. అప్పుడైతే.. కొంత‌మేర‌కు త్వ‌ర‌గా ప‌రిష్క‌రించుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతారు. ఎవ‌రు త‌న‌వ‌ద్ద‌కు వ‌చ్చినా.. సంస్థ‌ను సంప్ర‌దించినా.. వారిలో ధైర్యం నింప‌డంతోపాటు సేవే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఎంతో మంది పేద వారికి ఉచితంగా కూడా సేవ చేస్తున్నారు.
దేశ విదేశాల్లో ఎన్నో కార్పోరేట్ ఆసుప‌త్రుల్లో న‌యం కాని అటిజం పిల్ల‌ల‌కు పినాకిల్ బ్లూమ్స్ లోకి వ‌చ్చాక వాళ్లు మామూలు మ‌నుష్యులు అవ్వ‌డం వెన‌క కేవ‌లం వారిని ట్రీట్ చేస్తోన్న విధాన‌మే కార‌ణ‌మ‌ని చెపుతుంటారు శ్రీజా రెడ్డి. అటిజంలో అనేకానేక స‌మ‌స్య‌లు ఉన్నాయని.. ఆ స‌మ‌స్య‌ను స‌రిగా గుర్తించిన‌ప్పుడే మ‌నం స‌గం విజ‌యం సాధించిన‌ట్ల‌వుతుంద‌ని ఆమె చెపుతుంటారు.

" >

" >


" >


" >

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: