మాతృదేవో భ‌వ‌.. అన్న మాట‌కు నిలువెత్తురూపం శ్రీజారెడ్డి..!

Mamatha Reddy
హిందూ ధ‌ర్మ శాస్త్రాల ప్ర‌కారం త‌ల్లిని మించిన దైవం లేదు. అందుకే మాతృదేవో భ‌వ‌! అంటూ.. ఆ దైవానిక‌న్నా ఎక్కువ‌గా త‌ల్లిని ఆరాధించేలా చేసింది మ‌న ధ‌ర్మం. అలాంటి త‌ల్లికి మ‌రోరూపం.. డాక్ట‌ర్ శ్రీజారెడ్డి. బుడిబుడి అడుగులు వేసే ప్రాయంలోనే చిన్నారుల పాలిట పెద్ద శాప‌మైన స‌మ‌స్య‌లు అనేకం ఉన్నాయి. వారిలో మాన‌సిక ఎదుగుద‌ల లోపించ‌డం ద‌గ్గ‌ర నుంచి వారికి జ్ఞానేంద్రియాల స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయి. జ్ఞానేంద్రియాల్లో చిన్న పిల్ల‌ల‌కు ఏ స‌మ‌స్య వ‌చ్చినా వాటిని ప‌రిష్క‌రించ‌డానికి క‌ఠోర త‌పస్సు చేయాల్సిందే.
ముఖ్యంగా వీటిల్లో ఆటిజం(బుద్ధి మాంద్యం) స‌మ‌స్య తీవ్ర‌మైంది. దీనికి అనేక రూపాల్లో ప‌రిష్కారం చూపించి వేల మంది చిన్నారుల జీవితాల్లో వెలుగులు ప్ర‌సాదించారు... శ్రీజారెడ్డి. నిజానికి స‌మాజ సేవ అంటే.. ఆమ‌డ దూరం ఉండే ప్ర‌జ‌లున్న ఈ రోజుల్లో నేనున్నానంటూ.. ముందుకు వ‌చ్చారు స‌రిప‌ల్లి శ్రీజారెడ్డి. ఆటిజం అనేది ఒక అప‌రిష్కృత స‌మ‌స్య‌గా భావిస్తారు త‌ల్లిదండ్రులు. చిన్నారుల్లో మాన‌సికంగా ఎదుగుద ల ఉండ‌దు. అదేవిధంగా మాట్లాడ‌లేక పోవ‌డం.. అయిన వారిని కూడా గుర్తించ‌లేక పోవ‌డం.. త‌మ చుట్టు ప‌క్క‌ల ఏం జ‌రుగుతోందో తెలుసుకోలేక పోవ‌డం, చొంగ కార్చ‌డం, ఆక‌లి అయినా.. గుర్తించ‌లేక పోవ‌డం ఇలా అనేక స‌మ‌స్య‌లు ఆటిజంలో ఉన్నాయి.
వీటిని ప‌రిష్కరించుకునేందుకు.. ఈ దేశంలో ఎక్క‌డా స‌రైన వైద్య శాల‌లు లేవు. ఉన్న‌ప్ప‌టికీ.. త‌ల‌కొక చోట ఉన్నాయి. స్పీచ్ థెర‌పీ కోస‌మైతే.. విదేశాలే గ‌తి. ఇలాంటి స‌మ‌యంలో అక్క‌డెక్క‌డో వెళ్లి వైద్యం చేయించ‌డం అంటే.. త‌ల్లిదండ్రుల‌కు క‌ష్టంతో కూడుకున్న ప‌ని. ఈ స‌మ‌స్య‌ను త‌న కుమారుడు సంహిత్ ద్వారా గుర్తించిన శ్రీజారెడ్డి దంప‌తులు.. దేశంలోనే తొలిసారిగా పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థ‌ను ఏర్పాటు చేసి.. అన్ని సేవ‌ల‌ను ఒక్క‌ద‌గ్గ‌ర ఏర్పాటు చేశారు. అంతేకాదు.

అతి త‌క్కువ ఖ‌ర్చుకే చిన్నారుల‌కు ఉన్న ఆటిజం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు. త‌న స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూసుకుంటూనే ఈ దేశంలోని వేలాది మంది త‌ల్లుల స‌మ‌స్య‌ను కూడా త‌న‌దిగా భావించారు. ఈ క్ర‌మంలోనే అనేక మంది చిన్నారుల‌కు ఆటిజం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్నారు. ఇప్ప‌టికే వేల మందికి దిశానిర్దేశం చేశారు. చిన్నారుల ఆటిజం స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించారు. అంద‌కు ఆమె మాతృదేవో భ‌వ‌! అన్న నినాదానికి ప్రాణం పోశార‌ని అన‌డంలో ఎలాంటి అతి శ‌యోక్తీ లేదు..!

" >

" >

" >


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: