యాంకర్ సుమ కు, వాళ్ళ అమ్మకు మధ్య చెప్పలేని అనుబంధం..!!

Mamatha Reddy
తల్లి యొక్క గొప్పతనం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.. రాస్తే పుస్తకాలు సరిపోవు.. తీస్తే సినిమా థియేటర్లు సరిపోవు.. అంతటి గొప్ప తనం ఉన్న తల్లి గురించి ఎవరు మాత్రం చెప్పగలరు చెప్పండి.. సముద్రమంత ప్రేమ, ఆకాశమంత మమకారం ఎల్లలు లేని అభిమానాన్ని చూపే అమ్మ ప్రేమ ముందు ఎవరి ప్రేమ అయినా దిగదుడుపే.. ఇక మన సెలెబ్రిటీలు తమ తల్లులపై చూపించే రీతి చాలా వెరైటీ గా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఈ ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతి రోజు తమ తల్లులను స్పెషల్ గా ట్రీట్ చేస్తుంటారు..
అలాంటివారిలో ఒకరు యాంకర్ సుమ.. యాంకర్ గా అందరికి సుపరిచయమైన సుమ టాలీవుడ్ లో నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతుంది.. ఆమె ఏ షో లో ఉంటే ఆ షో లో నవ్వులు పూస్తాయి. కామెడీ పండుతుంది.. వచ్చే పార్టిసిపెంట్స్ కన్నా ఎక్కువ కామెడీ ఈమెనే చేస్తుంది.అందుకే ఆమెను తమ షో లో పెట్టుకోవడానికి అందరు నిర్వాహకులు ఆసక్తి చూపుతుంటారు. సుమ ఉంటేనే షో హిట్ అవుతుంది అన్న రేంజ్ కి ఆమె క్రేజ్ వెళ్ళిపోయింది.. కేరళ నుంచి సినిమా లలో నటించే అవకాశాన్ని అందిపుచ్చుకొని.. అడపా దడపా సినిమా లలో నటించి బాగా పాపులర్ అయి యాంకర్ గా సెటిల్ అయ్యింది..
అయితే తాను ఈ స్థాయికి రావడానికి, నన్ను ప్రోత్సహించిన మా అమ్మే కారణంఅంటుంది సుమ.. చాలా సందర్భాల్లో ఆమె మా అమ్మ వల్లే ఈ స్థానంలో ఉన్నాను అని చెప్తుంది. నేను అన్ని విద్యల్లో ఆరితేరాలని చాలా కళలు నేర్పించింది మా అమ్మ.. నాలో ఇంత టాలెంట్ కి, నా పొజిషన్ కి ముఖ్యకారణం మా అమ్మ అని చెప్పింది ఓ సందర్భంలో.. ఇక   సుమ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నటుడు రాజీవ్ కనకాల.. కాగా అప్పటికే ఆమెకు సినిమాల పట్ల ఇంట్రెస్ట్ ఉండడంతో, యాంకర్ గా అప్పుడే అడుగులు వేస్తూ ఇంత ఎత్తు ఎదిగింది.. ఆమె ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ యాంకర్ గా మారిపోయింది..తనకు సినిమాలంటే ఇష్టమని మొదట్లో యాంకర్ గా కంటే ఆర్టిస్ట్ గా ఉండడమే తనకు ఇష్టమని చెప్పింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: