అమ్మ: తల్లిపాలలో మంచి బ్యాక్టీరియా.. శిశువుకు ఎంతో మేలు..!?

N.ANJI
పుట్టిన పిల్లాడికి తల్లిపాలకు మించిన పోషకాహారం లేదు. శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ను పెంచేందుకు.. శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు తల్లి పాలు ఎంతో తోడ్పడుతుంది. అయితే తల్లిపాలలో బ్యాక్టీరియాలు ఉంటాయనే సంగతి ఇప్పటివరకు ఎవరికి తెలిసి ఉండదు. తల్లిపాలలో మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి.. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు తెలుపుతున్నారు.
నూతన పరిశోధన ప్రకారం తల్లి పాలలోని మంచి బ్యాక్టీరియా శిశువుల్లో రోగనిరోధక శక్తికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని నిపుణులు తెలిపారు. మాంట్రియల్, గ్వాటిమాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను నిర్వహించారు. ఫ్రాంటియర్స్ ఇన్ మైక్రోబయాలజీ జర్నల్‌లో పరిశోధనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ అధ్యయనం ప్రకారం తల్లి పాలలో మంచి బ్యాక్టీరియా వల్ల శిశువులో పెరుగుదల, ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే తల్లిపాలల్లో ఎప్పుడూ గుర్తించని సూక్ష్మజీవులను పరిశోధకులు కనుగొన్నారు. ఇప్పటి వరకు తల్లిపాలల్లో మైక్రోబయామ్ బ్యాక్టీరియా పాత్ర గురించి తెలిసి ఉండదు. ఈ బ్యాక్టీరియా శిశు జీర్ణాశయం, పేగులను కాపాడుతుందని, అలెర్జీ నివారిస్తుందని పరిశోధకులు తెలుపుతున్నారు.
తల్లిపాలల్లో గుర్తించిన బ్యాక్టీరియా శరీరంలో తెలియని పరాన్న జీవులను నాశనం చేస్తాయని పేర్కొన్నారు. దీంతోపాటు ట్యాక్సిన్స్, కాలుష్య కారకాల నుంచి రక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని మెక్ గిల్ బయో ఇన్ఫార్మెటిక్ వర్సిటీ ఆచార్యులు ఇమ్మాన్యూయెల్ గొంజాలెజ్ తెలిపారు. శిశువుల రోగనిరోధక శక్తికి పెంచడానికి తల్లులకు ఏ విధంగా సహాయపడాలనే విషయానికి ఈ ఆవిష్కరణ నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇందుకోసం పరిశోధకులు హై రెజల్యూషన్ ఇమేజింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తల్లి పాల నమునాలను విశ్లేషించారు.
గ్వాటెమాల పశ్చిమ హైలాండ్స్2లో ఎనిమిది మారుమూల గ్రామీణ వర్గాల్లో నివసిస్తున్న మామ్ మయాన్ తల్లుల పాలను తీసుకుని పరిశోధన నిర్వహించారు. కాలం గడుస్తున్న కొద్దీ ఈ బ్యాక్టీరియాల్లో వచ్చే మార్పులను గమనించారు. 6-46 రోజులు, 109-184 రోజుల చనుబాలను పరిశీలించారు. ఉత్తర అమెరికాలోని చాలా మంది తల్లుల మాదిరిగా కాకుండా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన ఆరు నెలల కాలం పాటు దాదాపు అన్ని మామ్-మాయాన్ తల్లులు పాలిచ్చారు. అలా పరిశోధనలు నిర్వహించగా.. పిల్లలకు రోగనిరోధక శక్తి పెంచే బ్యాక్టీరియాలు తల్లిపాలలో ఉంటుందని గుర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: