ఆ విషయంలో అనేక అనుమానాలు.. క్లారిటీ ఇస్తున్న మహిళలు!

P.Phanindra
మాస్కో: టెక్నాలజీ ఇంతలా వ్యాప్తి చెందుతూ పోతున్నప్పటికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో ఒక పదం గురించి మాత్రం బహిరంగంగా మాట్లాడేందుకు ప్రతి ఒక్కరు జంకుతుంటారు. ఆ పదం మరేదో కాదు ‘సెక్స్’. అవును సెక్స్ అనే పదం వింటే చాలు మనలో చాలా మంది ఆ పదానికి అసలు అర్థం ఏంటో కూడా తెలియదన్నట్టు వ్యవహరిస్తూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా ధైర్యం చేసి దాని గురించి మాట్లాడితే మిగతావారు వారిని వింతగా చూడటం మొదలుపెడతారు. అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటూ లేని పోని అభాండాలన్ని వేసేస్తారు. సెక్స్ అనే పదం గురించి మాట్లాడటం అసభ్యకరం అనేది ఇప్పుడు కొత్తగా అంటుందేం కాదు. సోవియట్ కాలం నుంచే ప్రజలు దీని గురించి మాట్లాడటానికి జంకేవారు. అప్పట్లో సెక్స్ అంటే కేవలం పిల్లలు పుట్టడానికి మాత్రమే పరిమితం అంటూ ప్రచారం సాగింది.
ఈ ప్రచారం కారణంగా సెక్స్ అనే పదం అసభ్యకర పదంగా మారిపోయింది. అయితే ప్రస్తుత సమయంలో ఈ అపోహను ప్రజల్లో నుంచి తొలగించాలని అనేక మంది సెక్సాలజిస్టులు నడుం బిగించారు. వీరిలో మహిళలు కూడా ఉండటం విశేషం. అసలు సెక్స్ అంటే ఏంటి? సెక్స్ అవసరాలు, తదితర విషయాలలపై అవగాహన కల్పించేందుకు ట్రైనింగ్ కోర్సులను కూడా నిర్వహిస్తున్నారు. రష్యాకు చెందిన విక్టోరియా ఫ్రాంక్ అనే డాక్టర్ ప్రస్తుతం సెక్స్ కోచ్‌గా మారారు. సెక్స్ గురించి మాట్లాడేందుకు ఇష్టపడని వారిని మానసికంగా దృఢంగా చేసి వారి ఆలోచనా స్థాయిని పెంచడమే తన ధ్యేయమని ఆమె అన్నారు. సెక్స్ కోచింగ్ అంటే సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఏం టెక్నిక్స్ ఫాలో అవ్వాలో చెప్పే కోర్స్ కాదని.. ప్రజల్లో సెక్స్‌పై ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించడమే ఈ సెక్స్ కోర్స్ కాన్సెప్ట్ అని అన్నారు.
గత కొద్ది కాలంగా రాజకీయాలు సెక్స్ అన్న పదానికి దూరంగా జరిగి సంస్కృతి, సంప్రదాయం అన్న పదాలకు ఎక్కువ విలువనిస్తూ ముందుకు వెళ్తున్నాయని యెలేనా రిద్కినా అనే మరో సెక్స్ కోచ్ పేర్కొన్నారు. ప్రస్తుతం సెక్స్‌పై సమాజంలో ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని, దాని కోసం తాము నడుం బిగించామని.. సెక్స్ గురించి చర్చించాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: