అమ్మ : పిల్లలు లేని వాళ్ళు ఇలాంటి జ్యూస్లు తాగితే తప్పక పిల్లలు పుడతారు.. !!

Suma Kallamadi
పెళ్లి అయిన ప్రతీ మహిళ ముందుగా కోరుకునేది అమ్మ అని పిలిపించుకోవాలని. ఆ రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తారు.చిట్టి పొట్టి అడుగులతో చిన్నారి తమ ఇంట్లో తిరగాలని అందరూ కోరుకుంటారు. కానీ మారుతున్నా జీవనశైలి కారణంగా చాలా మంది దంపతులకు పెళ్లి అయి చాలా రోజులయినా కూడా పిల్లలు కలుగడం లేదు. పిల్లలు పుట్టాలంటే దంపతులు ఇద్దరికీ ఎలాంటి సమస్యలు ఉండకూడదు. అయితే కొంతమందిలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. దీనికి ఎన్ని మందులు వాడినా కానీ ఫలితం లేకుండా పోతుంది. అలాంటప్పుడు కొన్ని నేచురల్ రెమిడీస్ ఈ సమస్యని పరిష్కరిస్తుంది. ఇందులో ముఖ్యంగా పండ్లు, పండ్ల రసాలు.. వీటిని తీసుకోవడం వల్ల సమస్య త్వరగా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు . ఆ జ్యూస్ లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


అరటి పండు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. వీటిని తినడం వల్ల ఎన్నో పోషకాలు మన శరీరానికి లభిస్తాయి. ఈ ప్రోటీన్స్ అన్ని లైంగిక సామర్థ్యాన్ని పెంచే పోషకాలుగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో బ్రోమోజోమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది కోరికలను పెంచే హార్మోన్‌ని బాగా ప్రేరేపిస్తుంది. అందువల్ల త్వరగా సంతానం కలగడానికి దోహదం చేస్తుంది.అలాగే పుచ్చకాయలో లైంగిక సామర్థ్యాన్ని పెంచే అద్భుత గుణాలు ఉన్నాయి. వీటిలో ఉండే పోషకాలు, అమైనో ఆమ్లాలు జననాంగాలకు రక్త ప్రసరణ ఎక్కువగా జరిగేలా చూస్తుంది. ఈ కారణంగా మగవారిలో రక్తప్రసరణ సరిగా జరుగుతుంది. కాబట్టి శృంగార సమస్యలు ఎదుర్కొనే వారు ఎక్కువగా ఈ జ్యూస్ తాగుతుండాలి. దానిమ్మలోనూ అద్భుత గుణాలు ఉన్నాయి. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. దీనిలో శృంగార కోరికలను రెచ్చగొట్టే గుణాలు ఉన్నాయి. ఈ పండుని జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మగవారిలో లైంగిక సమస్యలు చాలా వరకూ దూరం అవుతాయని అనేక పరిశోధనల్లో తేలింది.


అలాగే ఆపిల్‌లో లైంగిక సామర్థ్యాన్ని పెంచే ఎన్నో ప్రత్యేక గుణాలు ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ మీలో లైంగిక శక్తిని పెంచేందుకు దోహదపడుతుంది. ఈ జ్యూస్‌ని రెగ్యులర్‌గా తాగడం వల్ల అనేక శృంగార సమస్యలు దూరం అవుతాయి.కలబందలో కూడా ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచేందుకు అలోవేరా బాగా పనిచేస్తుంది.ఈ హార్మోన్ వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: