ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఇవి మ‌ర‌చిపోకండి సుమీ..!!

Kavya Nekkanti

సాధార‌ణంగా ఒక స్త్రీ గర్భంతో ఉన్నప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు చాలానే ఉంటాయి. ఆహరం నుండి మీరు వేసుకోవాల్సిన బట్టలు వరకు ప్రతి చిన్న విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో ఒక్కొక్కరి హెల్త్ ఒక్కోలా ఉంటుంది. వాళ్ల వాళ్ల శరీర తత్వాన్నిబట్టి.. వాళ్ల స్టామినా బట్టి ప్రెగ్నెన్సీ ఉంటుంది.  ఏ సమస్యనైనా అర్థం చేసుకోవడానికి, పరిష్కారం చెప్పడానికి డాక్టర్ సలహా తీసుకోవడం అత్యుత్తమం. అలాగే గ‌ర్భంతో ఉన్న‌ప్పుడు కొని అతి ముఖ్య‌మైన జాగ్ర‌త్త‌లు ఖ‌చ్చితంగా తీసుకోవాలి.

 

గర్భం దాల్చడం అనేది ఎంత గొప్ప ఆనందాన్ని ఇస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే గర్భం దాల్చిన తర్వాత ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం రక్తహీనత. మీ శరీరంలో రక్తస్థాయి ఎంత మోతాదులో ఉందో ఖ‌చ్చితంగా తెలుసుకోవాలి. ఒక‌వేళ మీకు ర‌క్త‌హీనత ఉన్న‌ట్లు తేలితే.. ఎక్కువగా గుడ్లు, పాలు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే గర్భం దాల్చిన తర్వాత, బిడ్డకు జన్మను ఇచ్చిన కొన్ని నెలల వరకు బ్లడ్ డొనేట్ చేయకూడదు.

 

ఒకే చోట ఉండకూడదు. ఎప్పుడు పడుకోవడం చేయకూడదు. కొద్ది దూరం నడవడం, ఉదయం సూర్య కిరణాల వెలుతురులో లేదా నడవటం చేయాలి.ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి ట్రావెలింగ్ చాలా మంచిదే. కానీ ఎక్కువసేపు కూర్చోకూడదు. కాబట్టి మధ్యలో కాస్త విరామం తీసుకుని.. కాసేపు నడవడం మంచిది. మ‌రియు జర్నీ చాలా కంఫర్ట్ గా ఉండేలా చూసుకోవాలి. పచ్చి పాలు, క్యాన్డ్ ఫుడ్స్, కెఫిన్ లాంటి ప‌దార్థాలు క‌డుపుతో ఉన్న‌ప్పుడు అస్స‌లు తీసుకోకూడ‌దు. అలసిపోయిన గర్భిణీ స్త్రీలు ఎక్కువ సేపు వెచ్చటి నీటితో స్నానం చేయడం వల్ల చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. దీంతో మీకు ఎంతో హాయిని కూడా ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: