జీవితంలో ఓడిపోయి తెర మీద గెలిచిన శ్రీదేవి...!

Gullapally Venkatesh

అతిలోక సుందరి శ్రీదేవి మరణం తర్వాత వివాదాస్పద దర్శకుడు, ఆమె అభిమాని రామ్ గోపాల్ వర్మ సామాజిక మాధ్యమాల్లో కొన్ని వ్యాఖ్యలు చేసారు. వచ్చే జన్మలో అయినా నీకోసం బ్రతుకు శ్రీ అంటూ కామెంట్స్ చేసారు. అవును శ్రీదేవి నిజ జీవితంలో ఓడిపోయినా వెండి తెర మీద విజయం సాధించింది. ఆమె స్పూర్తిగా ఎందరో అమ్మాయిలు హీరోయిన్లు అవ్వాలని, నటులు అవ్వాలని ముంబైలో అడుగుపెట్టారు. హైదరాబాద్ లో చెన్నై లో ఎందరో తెలుగు తమిళ అమ్మాయిలు అవకాశాల కోసం పడిగాపులు పడ్డారు. 

 

ఆమె చేయని హీరో లేరు, ఆమెను డైరెక్ట్ చేయని దర్శకుడు లేడు. ఆమెతో సినిమాలు చేయని నిర్మాతలు లేరు. ఆమెతో ఒక్క సినిమా అయినా చెయ్యాలి అనుకుని పట్టుదలగా ఎదురు చూసిన సహాయ నటులు ఎందరో. వెండి తెర మీద శ్రీదేవి ఒక సంచలనం. వెండి తెర మీద శ్రీదేవి ఒక ప్రభంజనం. శ్రీ జీవితం అంతా కష్టాల మయం. తండ్రి, తల్లి లేక కుటుంబ సభ్యుల్లో పట్టించుకునే వారు లేక ఎవరికో దగ్గరి ఎవరినో వివాహం చేసుకుని జీవితం మొత్తం నిందలు మోస్తూనే ఉంది. బోని కపూర్ తో వివాహం తర్వాత పిల్లల కోసం బతికింది ఆమె. 

 

వెండి తెర ఆమెను కోరుకుంది. ఆమె నవ్వు కోసం ఎదురు చూసింది. థియేటర్ లో తెర లేపగానే శ్రీదేవి రూపం కోసం ఎదురు చూసిన ప్రేక్షకులు ఎందరో. ముందు ఆమె సినిమాను ప్రేమించింది. ఆ తర్వాత సినిమా ఆమెను ప్రేమించింది. జీవితంలో ఎన్ని ఇబ్బందులు పడినా సరే ఆ ఇబ్బంది సినిమాల్లో చూపించలేదు. అంతులేని డబ్బు ఉన్నా సరే ఆమె పట్టుదలతో ముందుకి వెళ్ళింది. నేడు శ్రీ మన మధ్యన లేకపోవచ్చు. కాని ఆమె జ్ఞాపకాలు ఆమె చేసిన చిత్రాలు మన మధ్యనే ఉన్నాయి. భారతీయ సినిమా ఉన్నన్ని రోజులు శ్రీదేవి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: