బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మితే మరో మగాడితో కూడా అదే చేయమందట..

Satvika

ప్రతి ఫ్రెండ్ అవసరేమేరా అంటూ ఓ మొబైల్ నెట్ వర్క్ తమ పాపులారిటీని పెంచుకోవటానికి చేసిన యాడ్ ను ఓ స్నేహితురాలు తన అవసరాలకు వాడుకుంది. ఫ్రెండ్ అని తన మానాన్ని ఎరగా వేస్తూ నీచానికి ఒడిగట్టింది. ఫ్రెండ్ కదా అని నమ్మింది. చివరికి కుక్కలు చింపిన విస్తరిలాగా తన జీవితాన్ని మార్చుకుంది. వినడానికే ఎంత ఘోరంగా ఉందంటే ఇంకా అనుభవించిన ఆ మహిళకు మరి ఎలా ఉంటుంది అనేది ఊహించలేము. 

 

వివరాల్లోకి వెళితే.. వీరి పరిచయం ఒక విచిత్రం.. ఇద్దరు కలిసి చిన్ననాటి స్నేహితుల అంటే అది.. ఈ మధ్య మామూలు వాళ్ళు కూడా సెలెబ్రెటీలుగా అనుకునే యాప్ ఒకటి రాజ్యేమేలుతుంది. ఈ యాప్ వల్ల కొందరు సొమ్ము చేసుకుంటే మరి కొందరు మాత్రం పాపులారిటీ ను పెంచుకుంటున్నారు. అందుకే ఈ యాప్ రోజు రోజుకు మరింత జోరు పెంచుతుంది. 

 


అయితే, ఈ టిక్ టాక్ లో పరిచయమయిన యువతీ తో ఓ అమ్మాయి స్నేహం ఏర్పడింది.అలా వారిద్దరి మధ్య స్నేహ గువ్వా గోరింకల పెరిగింది. అలా ఉన్న వారిలో ఓ అమ్మాయి వ్యభిచారం చేయాలంటూ మరో అమ్మాయిని ఒత్తిడి చేసింది. వ్యభిచారం చేయాలంటూ బెదిరంచడాన్ని తట్టుకోలేని ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించిన ఘటన విల్లుపురం జిల్లాలో జరిగింది.సెంజి సమీపంలోని సత్యమంగళం గ్రామానికి చెందిన మనోహరన్‌, కడల్‌కన్ని (39) దంపతులకు ముగ్గురు పిల్లలు. భర్త మృతి చెందడంతో ఆమె, పిల్లలతో కలసి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.

 


ఈ నేపథ్యంలో, కడల్‌కన్ని సత్యమంగళం మహిళా పోలీస్‌ స్టేషన్‌లో అందజేసిన ఫిర్యాదులో... చెన్నైకి చెందిన సుమతి, లత, కవిత అనే ముగ్గురు టిక్‌ టాక్‌ యాప్‌ ద్వారా పరిచయమై స్నేహితులుగా మారారని తెలిపారు.అదే సమయంలో తనను వ్యభిచారం చేయాలని వారు ఒత్తిడి చేస్తున్నారని, ఇద్దరు పురుషులను పంపి రూ.2 లక్షలు ఇవ్వాలని, లేదంటే కిడ్నాప్‌ చేసి హత్యచేస్తామని బెదిరిస్తున్నారని ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కానీ పోలీసులు పట్టించుకోకపోవడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ప్రస్తుతం చికిత్స పొందుతుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: