స్నానం చేస్తున్నప్పుడు యువతి వీడియో తీశారు.. వైరల్ అవుతున్న వీడియో

Satvika

ఓ అమ్మాయి స్నానం చేస్తున్నప్పుడు మొబైల్ ద్వారా వీడియో తీసి తనకు కావలసిన వాళ్లకు ఆ వీడియో షేర్ చేశారు..సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రబుద్దుడికి బరిత పూజ చేసారు..యువతులు, మహిళలు స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తియ్యడమే పనిగా పెట్టుకున్న యువకుడు, అతని స్నేహితులు అసలు బండారం బట్టబయలు అయ్యింది. 

 

ఈ విషయం వెలుగు చూడటంతో పోలీసులకు బయపడి సముద్ర తీరప్రాంతంలో తలదాచుకున్న యువకుడిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.తమిళనాడులోని రామనాథపురం జిల్లా కీళ్ కరై సమీపంలోని కన్నిరాజపురంలో ఓ యువతి నివాసం ఉంటోంది. యువతి నివాసం ఉంటున్న ఇంటి పక్కనే ఎబేసన్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఎబేసన్ కామాంధుడు అని సమాచారం. యువతితో పాటు చుట్టుపక్కల నివాసం ఉంటున్న మహిళల మీద ఎబేసన్ కన్ను వేశాడు.

 

కేవలం తన మీదనే కాకుండా చాలా మంది మీద కన్నేశాడు అని సదరు మహిళలు వాపోతున్నారు..ఇది ఇలా ఉండగా మూడు మొబైల్ ఫోన్లలో మూడు విధాలుగా అమ్మాయిని స్నానం చేస్తున్నప్పుడు చిత్రీకరించి ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఒకరికరు షేర్ చేసుకున్నారు..వీడియోలను నిందితులు ముగ్గురు వారి వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశారు. తరువాత అదే వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చెయ్యడంతో వైరల్ అయ్యాయి. యువతి బంధువు ఒకరు ఆ వీడియో చూసి షాక్ కు గురైనాడు. వెంటనే యువతి కుటుంబ సభ్యులకు అతను సమాచారం ఇచ్చాడు.


దీంతో స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారని యువతి కీళ్ కరై మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదైయ్యింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఎబేసన్, ఎబిరోన్, విఘ్నేష్ ల కోసం గాలించారు. పోలీసులు మాకోసం గాలిస్తున్నారని తెలుసుకున్న ముగ్గురు పరారైనారు. కన్యాకుమరి జిల్లాలోని తేంగాయ్ పట్టినం తీర ప్రాంతంలో ఎబేసన్ తల దాచుకున్నాడని పోలీసులకు సమాచారం అందడంతో అతన్ని అరెస్టు చేశారు.. విషయం తెలుసుకున్న మరో ఇద్దరు ఫ్రెండ్స్ ను పట్టుకోవడానికి పోలీసులు గాలింపులు చేపట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: