ఉల్లి పకోడి

HANUMA HANUMA
కావాల్సిన పదార్ధాలు  శనగపిండి 2కప్పులు ఉల్లిపాయలు పెద్దవి 4  పచ్చిమిరపకాయలు 4  కరివేపాకు 1టే.స్పూన్  అల్లం తురుము 1టే.స్పూన్  ఉప్పు తగినంత  నూనె సరిపడినంత  తయారీ విధానం గిన్నెలోకి శనగపిండిని తీసుకుని ఉండలు లేకుండా కలపాలి. ఈ పిండిలో ఉల్లిపాయముక్కలు,పచ్చిమిర్చి,అల్లం,కరివేపాకు,ఉప్పు వేయాలి. కొద్దిగా నీటిని తీసుకుని మరీ జారుగా కాకుండా, కొంచెం గట్టిగా కలపాలి. స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి దానిలో నూనె పోయాలి. నూనె బాగా కాగిన తర్వాత పిండిని తీసుకుని చేత్తో సన్న సన్నని ఉండలుగా వేసి, వేగిన తర్వాత తీయాలి. వేడివేడి పకోడీని సాస్ తో తింటే ఎంతో రుచిగా ఉంటాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: