కోడి మాంసం వేపుడు!

Durga
రొస్టెడ్ చికెన్ రెసిపీ కావలసినవి : చికెన్ : ఒకటి తాజా హెర్బల్ ఆకులు (రోజ్ మేరీ , కొత్తిమీర , సేజ్ , వాము , పుదీనా ): అరకప్పు ఉప్పు : రుచికి సరిపడా మిరియాలు : రుచికి సరిపడా నిమ్మరసం : 2 టేబుల్ స్పూన్లు నూనె : మూడు టేబుల్ స్పూన్లు కిచెన్ కింగ్ మసాలా : టేబుల్ స్పూను కారం : టేబుల్ స్పూను స్టఫింగ్ కోసం  నిమ్మకాయ : అరచెక్క వెల్లుల్లి : కొన్ని రోజ్ మేరీ : చిన్న కొమ్మ  తయారు చేసే విధానం : ఓవెన్ ను ముందుగానే 180 డిగ్రీల సెంటీగ్రేడు దగ్గర వేడి చేయాలి. చికెన్ పైన ఉన్న తోలు , లోపల ఉన్న కొవ్వు తీసేయాలి .తరవాత శుభ్రంగా కడిగి పలుచని బట్టతో తడిలేకుండా అద్దాలి. తాజా ఆకులన్నీ సన్నగా తరగాలి. ఓ చిన్న గిన్నెలో ఆకుల తురుము , ఉప్పు , మిరియాలపొడి, నిమ్మరసం, నూనె, చికెన్ కింగ్, కారం వేసి కలపాలి. కోడి పొట్టు లోపల నిమ్మచెక్క , వెల్లుల్లి రెబ్బలు , రోజ్ మేరీ ఉంచాలి .ఇవి తినడానికి కాదు , కేవలం మంచి వాసన కోసమే . ఇప్పుడు తాజా ఆకుల తురుముని కోడికి అన్ని వైపులా పట్టించాలి. ఛాతీ దగ్గర చర్మం వదులుగా లాగి లోపల కూడా పట్టించాలి. కాళ్లను మందపాటి దారంతో కట్టేసి బేకింగ్ ట్రేలో పెట్టి ఓవెన్ లో సుమారు గంట నుంచి గంటన్నర సేపు రోస్ట్ చేయాలి. మధ్యమధ్యలో చికెన్ నుంచి కారిన జ్యూస్ ని అది ఎండిపోకుండా చికెన్ కు పట్టిస్తుండాలి. మొత్తం రోస్ట్ అయ్యాక దాన్ని అలాగే పదిహేను నిమిషాలు ఉంచాలి. బయటకు తీసి పోట్టలోపల ఉంచినవన్ని తీసేయాలి. ఇప్పుడు దీన్ని కావలసినట్లుగా ఏ భాగానికా భాగాన్ని విడదీసీ వడ్డించాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: