బీట్ రూట్ హల్వా

Durga
 కావలసిన పధార్థాలు : బీట్ రూట్ : అర కిలో పంచదార : ¼ కిలో నెయ్యి : ¼ మిగడ : ½ కప్పు పాలు : ½ కప్పు కిస్ మిస్ : కొంచెం జీడిపప్పు: తగనన్ని యాలకులు పొడి: ½చెంచా తయారు చేసేవిధానం : బీట్ రూట్ చెక్కుతీసి సన్నగా తరిమి బాండీలో రెండు చెంచాలు నెయ్యివేసి తురుమును వేయించి నీరు పోసిన తరువాత పాలు, తురుము కలిపి కుక్కర్ లో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. తరువాత మళ్లీ పాలలో వేసి పాలు పూర్తిగా ఇగిరిపోయేలా ఉడకించాలి గరిటెతో త్రిప్పుతూ పంచదార, మీగడ వేసి నెయ్యి కలపాలి. బాగా వేగి నెయ్యి పైకి తేరిన తరువాత యాలకుల పొడి కూడా కలిపి డిష్ లోకి వేసి దానిపైన కిస్ మిస్, బాదంపప్పు, జీడిపప్పు అలంకరించి సర్వ్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడిగా తింటే రుచి మరి పెరుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: