స్కూల్ కు కూడా వెళ్ళలేదు... కానీ తెలివితో పద్మశ్రీ అవార్డు సొంతం చేసుకుంది

Vimalatha
ప్రపంచవ్యాప్తంగా సీడ్‌ మదర్‌గా పేరుగాంచిన మహిళా రైతు రహీబాయి సోమా పోప్రే. వ్యవసాయంపై ఆమెకున్న పరిజ్ఞానం కోసం పద్మశ్రీతో సత్కరించారు. రాహీబాయి నిరక్షరాస్యురాలు, కానీ ఆమె తన విజయానికి దారిలో అడ్డు పడిన తన బలహీనతని ఎప్పుడూ ముందుకు రానివ్వలేదు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన రాహీబాయి పోప్రే తన పని కారణంగా సీడ్‌ మదర్‌ గా గుర్తింపు పొందింది. ఒక సంవత్సరం ముందు హైబ్రిడ్ విత్తనాలకు వ్యతిరేకంగా ఆమె చేసిన ప్రచారం కథపై నగరానికి చెందిన ఓ చిత్రనిర్మాత రహీబాయి పోప్రే అనే మూడు నిమిషాల లఘు చిత్రం తెరకెక్కించగా, 72వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నెస్ప్రెస్సో టాలెంట్ 2019 అంతర్జాతీయ విభాగంలో మూడవ బహుమతిని గెలుచుకుంది.
పాఠశాల గడప ఎక్కని రహీబాయి, దేశీయ విత్తనాల పరిరక్షణ మరియు ప్రచారం కోసం కృషి చేస్తుంది. శాస్త్రవేత్తలు కూడా వారి విత్తనాల జ్ఞానాన్ని ఒక నిధిగా పరిగణిస్తారు. తన కఠోర శ్రమతో దేశవాళీ విత్తనాల బ్యాంకును రూపొందించి రైతులకు ఎంతో మేలు చేకూరుస్తున్నారు. విషపూరితమైన కూరగాయ తిని మనవడు అస్వస్థతకు గురికావడంతో ఆమె కలత చెంది, దేశవాళీ విత్తనాలపై మొగ్గు చూపారు. పద్మశ్రీ రహీబాయి సేంద్రియ వ్యవసాయంతో పాటు దేశీయ విత్తనాల వినియోగం, పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. దీనితో పాటు ఆమె ప్రజలను సేంద్రీయ ఉత్పత్తులను ఉపయోగించమని ప్రోత్సహిస్తుంది. పట్టుదల, కృషి ఉంటే అడ్డేది కాదని ఆమె నిరూపించారు. కాబట్టి అనుకున్నది సాధించడానికి అలుపెరగక ముందుకు సాగండి.

నేడు గుజరాత్‌, మహారాష్ట్రల్లో సంప్రదాయ విత్తనాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. అంతే కాకుండా ఈ విత్తనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ విత్తనాల డిమాండ్‌ను పెంచడంలో రాహిబాయి ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. లేకుంటే ఎక్కువ దిగుబడి వస్తుందన్న ఆశతో రైతులు వేరే వాటి వెంట పరుగులు తీస్తున్నారు. దీంతో దేశవాళీ విత్తనాలు దాదాపు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. దీని వల్ల పంటలకు అనేక రకాల వ్యాధులు వస్తాయి. సీడ్ మదర్ అని పిలువబడే రాహీ బాయి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడంలో కూడా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం రాహీబాయి 50 ఎకరాల్లో 17 రకాలకు పైగా పంటలు పండిస్తోంది. ఆమె నారీ శక్తి సమ్మాన్‌ని కూడా అందుకుంది. మరియు BBC 100 మంది శక్తివంతమైన మహిళలలో కూడా ఆమె పేరు సంపాదించుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: