బర్రెలు అమ్మడం ద్వారా కోట్లు సంపాదిస్తున్న ఐటి ఎంప్లాయిస్

VAMSI
ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా జీవితాంతం కష్టాల్లో జీవించాలని అనుకోరు. ఒక స్థాయికి వచ్చాక ఖచ్చితంగా ఏదో ఒక విధంగా స్థిరపడాలి అనుకుంటారు. అది ఏ రకంగా అయినా కావొచ్చు. ఒక ఉద్యోగం, వ్యాపారం లేదా ఇంకేదైనా చేసి సుఖంగా బ్రతకాలని ఆశ పడుతారు. ఆ విధంగా వారు మొదట బాగా చదువుకుంటారు. మంచి ఉద్యోగంలో స్థిరపడుతారు. అయితే అందరిలాగే నీతూ యాదవ్ జైపూర్ మరియు కీర్తి జంగ్రా హర్యానా అనే ఇద్దరు యువతులు ఢిల్లీలో తమ ఐఐటిని పూర్తి చేసుకున్నారు. తర్వాత వారి వారి ప్రదేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకో వీరికి ఉద్యోగాలు చేయడంలో ఇంటరెస్ట్ గా లేరు. ఏదో మిస్ అవుతున్నామనే భావన వీరిద్దరిలోనూ కలిగింది.
ఏదియో ఒకటి సాధించాలని గట్టిగా  అనుకున్నారు. ఇద్దరు తమకు వచ్చిన ఐడియాలను పంచుకుంటూ ఉండేవారు. అలా వీరికి ఒక ఐడియా తట్టింది. అదే బర్రెలు అమ్మడం. అదేంటి వినడానికి విచిత్రంగా ఉందా? ఈ ఆలోచనే వీరికి కోట్లు సంపాదించడానికి కారణం అయింది. ఇక వెంటనే 2019 వ సంవత్సరంలో బెంగుళూరు లో ఒక చిన్న రూమ్ ను అద్దెకు తీసుకున్నారు. ఒక యానిమల్ యాప్ ను రూపొందించి దాని ద్వారా బర్రెల అమ్మకాన్ని స్టార్ట్ చేశారు. ఈ యాప్ లో రైతులు ఎవరైనా వారి బర్రెలను అమ్మవచ్చు మరియు కొనవచ్చు. కానీ అప్పుడప్పుడే ఈ యాప్ రావడంతో ఆ సంవత్సరానికి కేవలం 50 బర్రెలను మాత్రమే అమ్మగలిగారు.
అయితే లాక్ డౌన్ రాకతో వీరి యాప్ బాగా ప్రసిద్ధి చెందింది. దీనితో ఆ తర్వాత ఈ యాప్ ను హిందీలోనూ తయారుచేసారు. మొత్తం రాజస్థాన్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి చాలా రాష్ట్రాల్లో 80 లక్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. దెబ్బతో ఈ యాప్ కు ఆదరణ మాములుగా లేదు . ఇప్పుడు ఒక నెలకు 50 వేల బర్రెలను అమ్మే స్థాయికి చేరుకున్నారు. ఆ విధంగా వీరు వందల కోట్లు ఈ వ్యాపారం ద్వారా ఆర్జిస్తున్నారు. ఒక ఉద్యోగం మొదలైన వీరి ఆలోచన ఇప్పుడు ఎవరి మీదా ఆధారపడకుండా ఇంత స్థాయికి చేరుకోవడంతో అందరూ వీరిని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: