"అగ్ని శ్వాస" అగ్ని పరీక్షను దాటింది

"అగ్ని శ్వాస" అగ్ని పరీక్షను దాటింది
తెలుగు కవితా సంపుటి "అగ్ని శ్వాస"  ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అవారుర్డు లభించింది. ఈ పుస్తక  రచయిత నిఖిలేశ్వర్ దేశ రాజధానిలో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుల ప్రధానోత్సవానికి దేశం నలుమూలల నుంచి , అంటే ఇరవై రెండు భాషల నుంచి సాహిత్యవేత్తలకు పురస్కారం అందుకున్నారు. విప్లవ కవిగా పేరుగాంచిన నిఖిలేశ్వర్ కు 2020 సంవత్సరానికి గాను ఈ అవార్డును ప్రధానం చేశారు. ఆయన 2015-17 మ ధ్య కాలంలో ఈ కవితా సంపుటిని వెలువరించారు. ప్రముఖ ఆంగ్ల రచయిత్రి అరుంధతీ సుబ్రమణ్యం రచించిన "వెన్ గాడ్ ఈజ్ ద ట్రావెలర్ ", కేంద్ర మాజీ మంత్ర, కన్నడ రచయిత వీరప్ప మొయిలీ రచించిన "శ్రీ బాహుబలి అసింస దిగ్విజయం" లు కూడా కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు అందుకున్నాయి. అవార్డు అందుకున్న వారికి లక్ష రూపాయల నగదును, జ్ఞాపికను అందించారు. ఈ కర్యక్రమంలో ప్రముఖ హిందీ రచయిత విశ్వ ప్రసాద్ తివారి, సాహిత్య అకాడమీ అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖర్ , శ్రీనివాస రావులుపాల్గొన్నారు.
 తనకు కేంద్ర సాహిత్య అవార్డు రావడం సంతోషంగా ఉందని  "అగ్ని" శ్వాస రచయిత  నిఖిలేశ్వర్ తెలిపారు. ఢిల్లీలో తనను కలసి విలేఖరులతో  ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. పోరాటాల ధ్యాసతోనే ముందుకు సాగుతానని చెప్పారు. "నా శ్వాస అగ్ని శ్వాస" అని అభివర్ణించారు. భారత దేశంలో కవుల పరిస్థితులు ఏ మాత్రం బాగో లేవని నిఖిలేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదోని అయ్యోరికి అనువాద  పురస్కారం
కర్నూలు జిల్లా ఆదోనిలో జన్మించి, ఉపాధ్యాయుడిగాా పదవీ విరమణ చేసిన అనువాద రచయిత శ్రీ రంగనాథ రామచంద్ర రావుకు 2020 సంవత్సరానికి గాను అనువాద రచయిత పురస్కారం లభించింది. 2014-18 మధ్య తెలుగులోకి అనువాదమైన రచనలను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. రామచంద్రరావు  "ఓం నమో" అనే కన్నడ నవలను తెలుగులోనికి అనువదించారు. ఈ అనువాద నవలకు పురస్కారం లభించింది. ఆ అవార్డు క్రింద యాభై వేల రూపాయన నగదు తావ్రపత్రం అందజేశారు. రామచంద్ర రావు "కన్నడ కథలు", "దింపు కళ్లెం",  "నలుపు, తెలుపు కొన్ని రంగులు" తదితర రచనలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: