విజయం మీదే: పిల్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించండి...

VAMSI
ఆత్మ విశ్వాసం అనేది ప్రతి వ్యక్తి లోనూ మిన్నగా ఉండాలి. అప్పుడే మనిషి సంతృప్తికరమైన జీవితాన్ని జీవించగలడు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి, అనుకున్నది సాధించడానికి, కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి, విద్య, వృత్తి ఇలా ప్రతి పని లోనూ మీకు అండగా ఆత్మ విశ్వాసం ఉన్నప్పుడే వాటిని పరిపూర్ణంగా పూర్తి చేయగలరు. కోరుకున్నది అందుకోగలరు. మీపై మీకు నమ్మకం లేదంటే మీ ప్రతి కలలు, కోరికలు కల్లలు గానే మిగిలి పోతాయి. ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగితేనే ఏ పనైనా మొదలు పెట్టగలరు. అలాగే దాన్ని పూర్తి చేసి విజయ శిఖరాన్ని చేరుకోగలరు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో తల్లి తండ్రులు పాత్ర ఎక్కువగా వుంటుంది.
పిల్లలకి తొలి గురువు తల్లితండ్రులే. అందుకే వారి పెంపకం పిల్లల భవిష్యత్తుపై ఎక్కువగా ఉంటుంది. మొక్కై వంగనిది మానై వంగదు అంటారు పెద్దలు. ఏదైనా సరే చిన్నతనం నుండే అలవాటు పడుతుంది. కనుకనే వారికి మంచి చెడుల మధ్య తేడాను, చిన్నతనం నుండే తెలియచేయాలి. ముఖ్యంగా వారి ప్రతి పనికి అడ్డు పడుతూ వద్దంటూ ఆపకూడదు, వీలైనంత వరకు వారిని ప్రోత్సహించాలి. వారు చేసే పనులను ప్రతి సారి తప్పంటూ, అడ్డుపడుతుంటే వారిలో ఆత్మ విశ్వాసం తగ్గుతుంది. నెమ్మదిగా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు. అది వారి భవిష్యత్తులో వారి అభివృద్ధికి అడ్డుపడే అవకాశం ఉంది.
ఆత్మ విశ్వాసం ఉన్నప్పుడే అడుగు ముందుకు పడుతుంది. ఆ ప్రయాణం మన గమ్యానికి చేరుస్తుంది.
మనల్ని మనం ఎప్పుడు తక్కువ చేసుకోకూడదు, ఇతరులతో పోల్చుకుని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుంటే మీలోని ఆత్మ విశ్వాసం కనుమరుగవుతుంది. మీలో ఉన్న బలాన్ని గుర్తించండి. ప్రతి మనిషిలోనూ ఒక ప్రత్యేకత ఉంటుంది.  మీ నమ్మకం, సామర్ధ్యత  మిమ్మల్ని సక్సెస్ అందుకునేలా చేస్తాయి.  కాబట్టి జీవితంలో మీ పిల్లల ఎదుగుదలలో ప్రతి ఒక్క అంశాన్ని చాలా జాగ్రత్తగా గమనించి నిర్ణయాలు తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: