విజయం మీదే: పిల్లల విషయంలో ఈ తప్పు చేయకండి ?

VAMSI
ప్రతి ఒక్కరి జీవితం వారి కుటుంబంపై ముఖ్యంగా పిల్లలపై ఆదారపడి ఉంటుంది. అలాంటప్పుడు పిల్లల భవిష్యత్తే వారి జీవితం అవుతుంది. తల్లిదండ్రులు ఎప్పుడూ వారి సంతానం యొక్క జీవితం బాగుండాలని ఆకాంక్షిస్తారు. అందుకోసమే కష్టమైనా సరే మంచి భవిష్యత్తు అందించేందుకు ఎంతో శ్రమిస్తారు. ఈ క్రమంలో వారు ఎంతగానో బీజీ అయిపోవచ్చు. అసలు సమయం అన్నదే దొరకక పోవచ్చు. కానీ పిల్లల్ని మాత్రం ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. వారే మన జీవితం అయినప్పుడు...వారు చక్కగా మంచి మార్గంలో పెరిగేలా చూడటం మన భాద్యత. కానీ నేటి బీజీ లైఫ్ లో ఉద్యోగమంటూ, సంపాదన అంటూ ప్రతి ఒక్కరూ కాలంతో పరుగులు తీస్తున్నారు. చాలా మంది తమ పిల్లలకు సౌకర్యవంతమైన, అన్ని వసతులతో కూడిన జీవితాన్ని ఇస్తున్నాము ఇక వారి భవిష్యత్తు వచ్చిన ఢోకా ఏమీ లేదంటూ సంతోష పడుతున్నారు.
కానీ, అసలు తమ పిల్లలు ఎలా ఏ నడవడికలో పెరుగుతున్నారు అన్న విషయంపై పెద్దగా శ్రద్ధ చూపడం లేదు. వాస్తవానికి ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు గుర్తుంచుకోవాల్సిన విషయం. పిల్లలకు అన్ని సౌకర్యాలు కల్పించడం మంచిదే. కానీ తద్వారా వారిని పూర్తిగా సోమరిపోతులను చేయరాదు. వారి పనులు వారే చక్కబెట్టుకునేలా చిన్నప్పటి నుండే నేర్పించాలి. డబ్బు విలువ...తెలిసేలా పెంచాలి. ప్రతి రూపాయి వెనుకున్న కష్టాన్ని వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పించాలి. మంచి చెడుల మద్య వ్యత్యాసం తెలిసేలా చేసి సరైన మార్గంలో నడిపించాలి.
అంతే కాకుండా వారి జీవితానికి ఒక లక్ష్యం ఉండేలా, ఆ లక్ష్యాన్ని మీ పిల్లలే సెలెక్ట్ చేసుకునేలా ప్రేరేపించాలి. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు దిశా మార్గం చూపించాలి. ఇలా పిల్లల పెరుగుదల పట్ల ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తే వారి జీవితం సంతోషంగా ఉంటుంది. భవిష్యత్తులో మీరున్న లేకపోయినా వారు ఎన్ని కఠిన పరిస్థితులు ఎదురయినా వాటన్నింటినీ దాటుకుంటూ విజయవంతంగా ముందుకు వెళుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: