అమ్మ: తల్లిపాలు ఆ రంగులో ఉంటే కాన్సర్ ఉన్నట్లేనా..?

N.ANJI
గర్భిణులకు పిల్లలకు జన్మనిచ్చిన ఆరు వారాల తర్వాత బ్రెస్ట్ మిల్క్ పింక్ కలర్‌లోకి మారిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అందులో భాగంగానే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు కొన్ని రకాల కలర్స్ మారుతాయని, ఆమెకు ఆ విషయం తెలియదని అంటున్నారు. అంతేకాదు.. ఆ విషయం గురించి ఎవరు వివరించింది లేదని అంటున్నారు. అయితే సాధారణంగా బ్రెస్ట్ మిల్క్ పసుపు, తెలుపు లేదా క్రీమ్ కలర్‌లో ఉంటాదన్న సంగతి అందరికి తెల్సిందే. కాగా.. కొద్ది శాతం మంది బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు కొన్ని రకాల రంగులను కూడా చూడటం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే దానికి ప్రధాన కారణం ఏంటంటే.. తల్లి తీసుకునే ఆహారం అని గమనించాలని చెపుతున్నారు. తల్లి ఎప్పుడైతే రోజు వారీ ఆహారంలో ఒక రకమైన ఆహార పదార్థాలను తీసుకుంటారో దానిపై బ్రెస్ట్ మిల్క్ రంగు ఆధారపడి ఉంటుందని వివరించారు. అయితే ఉదాహరణకు తల్లి పాలు ఎరుపు, నీలి రంగు, కాషాయ రంగులో ఉంటుంది. ఇక ఎప్పుడైతే తల్లి బీట్రూట్ లేక కమల వంటి జ్యూసులు తాగుతారో వాటిలో ఉండే సహజమైన రంగులు వల్ల బ్రెస్ట్ మిల్క్ యొక్క రంగు అనేది మారుతుంది అని వైద్యులు చెబుతున్నారు.

ఇక ఎక్కువ మంది మహిళలో బ్రెస్ట్ మిల్క్ పసుపు రంగులో లేక తెలుపు రంగులో ఉంటుంది అని అందరూ గమనించి ఉంటారు. అంతేకాదు.. కొన్నిసార్లు బ్రెస్ట్ మిల్క్‌లో కొంత శాతం రక్తం కలవడం వల్ల బ్రెస్ట్ మిల్క్ బ్రౌన్ లేదా రస్ట్ కలర్‌లో ఉంటుందని తెలిపారు. అయితే బ్రెస్ట్‌లో ఎటువంటి ఇన్ఫెక్షన్ అయినా ఎదుర్కొన్నా సరే రంగు మారుతుందని చెప్పుకొచ్చారు.

కాగా.. నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్రెస్ట్ మిల్క్‌లో మిల్క్ పింక్ కలర్‌లోకి మారుతుంది అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఒక బ్యాక్టీరియాకు సంబంధించినది దీని వల్ల ఎన్నో జబ్బులు ఎదుర్కోవాల్సి ఉంటుందని వెల్లడించారు. అంతేకాదు.. బ్రెస్ట్ మిల్క్ బ్లడ్ లేక పింక్ కలర్‌లో ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని చెబుతున్నారు. అది బ్రెస్ట్ క్యాన్సర్ ఉండటం వల్ల కూడా ఇలా జరుగుతుందని వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: