కరోనా సమయంలో కష్టం రాకూడదని ఈ ఇద్దరు మహిళలు చేసిన పని ఎంతో గొప్పది?

Mamatha Reddy
మహిళల్లో రోజురోజుకీ ఆత్మస్థైర్యం, ధైర్యం ఎంతో పెరిగిపోతున్నాయి. మగ తోడు ఉంటేనే తమకు బ్రతుకు అన్న ఆలోచనలను తీసేసి తమ కాళ్లమీద తాము నిలబడడం మొదలుపెట్టారు మహిళలు. ఎంతోమంది మహిళలు ఎన్నో రంగాల్లో రాణిస్తూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఒడిశాలో కరోనా వల్ల ఓ ప్రైవేటు టీచర్ ఉద్యోగం పోయిందని చెత్త ఎత్తి పోసే వాహనానికి డ్రైవర్ గా మారింది. ముంబైలో ఒక ఇల్లాలిని భర్త వదిలేసి పోవడంతో మూడు చక్రాల ఆటోను నాలుగు రోడ్ల మీద తిప్పుతోంది. వీరిలో ఓడిపోయామని భావం కంటే గెలవాలన్న తపన ఎక్కువ ఉంది.

ఓడిపో వద్దు అంటూనే గెలవడానికి బ్రతకడానికి పరిగెత్తండి అని చెబుతూ వీరు ఈ విధంగా చేస్తూ ఉండడం ఎంతో మంది కి స్ఫూర్తి గా నిలుస్తోంది. కరోనా రోజుల్లో ఎంతో మంది ఉద్యోగాలు పోగొట్టుకొని రోడ్డుమీదకు వచ్చి అష్టకష్టాలు పడుతున్నారు. ఉపాధులు తారుమారు అవుతున్న  ఈ రోజుల్లో కష్టంగా ఉన్నప్పుడు భుజాల్లో శక్తి ఊరుతుంది. లోపల శక్తి బయటకు వస్తుంది.  మొండి ధైర్యం ఏర్పడుతుంది దానికి ఉదాహరణ వీరిద్దరూ. 

ఈ కష్ట సమయంలో తమ కుటుంబాన్ని కాపాడుకోవడమే అన్నింటికన్నా ముఖ్యమైన కర్తవ్యం అని భావించి వీరిద్దరు గత 15 నెలలుగా ఈ రకంగా పనిచేస్తూ వస్తున్నారు. కొన్నిచోట్ల వీరికి ఎన్నో సవాళ్లు కూడా ఎదురవుతాయి. ఆ సమయంలో స్త్రీలు ఆ సవాళ్లకు సమాధానంగా నిలుస్తున్నారు. వీరి స్ఫూర్తితో మరెంతో మంది మహిళలు ముందుకు వచ్చి తమ కాళ్ళమీద తాము నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తూ పురుషులకు ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు సంపాదించుకుంటున్నారు. పురుషులు ఎంత బాగా పని చేసిన బద్ధకం, తాగుడు వంటి అలవాట్లతో కుటుంబాన్ని కష్టపెడతారు. కానీ స్త్రీలు ఈ విషయంలో ఎంతో బాధ్యత గా పనిచేసి దేశంలో చాలా చోట్ల రాణిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: