"పిన్నాకిల్ బ్లూమ్స్" సంస్థను నెలకొల్పడం వెనుకున్న కారణం ఇదే ?

VAMSI
ఆటిజం అనే అరుదైన వ్యాధి గురించి పెద్దగా ఎవరికీ తెలిసుండకపోవచ్చు, అవగాహన ఉండకపోవచ్చు. అయితే ఈ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పిల్లల తల్లిదండ్రులకు మాత్రం ఇదో ప్రత్యక్ష నరకం. మానసిక ఎదుగుదల లేని తమ పిల్లల ప్రవర్తన చూసి కృంగిపోతుంటారు ఆ తల్లిదండ్రులు. ఖర్చుతో కూడుకున్న ఈ వైద్యాన్ని తమ చిన్నారులకు అందించలేక సతమతమౌతూ నిస్సహాయులైన తల్లిదండ్రులకు ఇదో పెద్ద సమస్య. అటువంటి వారి కన్నీళ్లు తుడవడానికి, తమ పిల్లలకు అండగా నిలబడటానికి ముందుకొచ్చారు సమాజ సేవకురాలు డాక్టర్ సరిపల్లి శ్రీజా రెడ్డి. ఆటిజం సమస్య తో బాధపడుతున్న చిన్నారులకు చికిత్స అందిస్తూ వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు ఈమె. అసలు ఆటిజం అంటే ఏమిటి ? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అంటే ?
ఆటిజం అనునది మెదడు అభివృద్ధికి చెందిన ఒక ఆరోగ్య సమస్య. సంక్లిష్టమైన అభివృద్ధి రుగ్మత. చిన్నారుల్లో చాలా అరుదుగా కనిపించే ఈ వ్యాధి తల్లిదండ్రులకు శాపం అనే చెప్పాలి. పిల్లలు శారీరకంగా ఎదిగినప్పటికీ ఈ సమస్య కారణంగా మానసికంగా పరిణితి పొందరు. ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన లోపానికి దారితీస్తుంది ఈ వ్యాధి. బాల్యదశ యొక్క ప్రారంభ దశలలో, ఆటిజం అనునది సమాజముతో పిల్లలు వ్యవహరించే సామర్థ్యము మరియు సమాజములో వారు వ్యవహరించే తీరును ప్రభావితం చేస్తుంది. ఆటిజంకు ప్రామాణిక చికిత్స లేదు. ముఖ్యంగా ఫిజియోథెరపీ చికిత్సలు మెరుగైన ఫలితాన్ని అందిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఆటిజంతో బాధపడే చిన్నారులలో ముఖ్యంగా 3 సమస్యలు ఎక్కువగా కనబడుతుంటాయి.
* బలహీనమైన శబ్ద మరియు అశాబ్దిక సమాచార మార్పిడి
* సామాజిక పరస్పర చర్యలతో అనుసంధానం కాకపోవడం( కమ్యూనికేషన్ లో లోపాలు)
* ఇరుకైన, పరిమితం చేయబడిన ఆసక్తులతో పునరావృత ప్రవర్తన యొక్క నమూనా.
అయితే ఇటువంటి సమస్యలతో బాధితులుగా మారిన చిన్నారులకు తన వంతు సహాయం అందజేస్తూ.. నిష్ణాతులైన వైద్య నిపుణులతో చికిత్సనందిస్తున్నారు శ్రీజ రెడ్డి. పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థను స్థాపించి ఆటిజం సమస్య ఉన్న పిల్లలకు వైద్య సేవలు అందిస్తున్నారు. మొదట 2017 లో హైదరాబాద్ లో ఈ సంస్థను నెలకొల్పిన శ్రీజా నేడు ప్రపంచ దేశాల్లో సైతం తన సంస్థను విస్తరించి ఆటిజం పిల్లలకు వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొస్తున్నారు. అయితే ఇంతమంది చిన్నారులకు వైద్య సేవలను అందిస్తున్న ఈమె ప్రేరణ వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఈమె చిన్నారి గారాల తనయుడు కూడా ఒక ఆటిజం బాధితుడే. అలా అప్పట్లో ఆమె పడిన ఆవేదనే ఆ తర్వాత పినాకిల్ బ్లూమ్స్ అనే సంస్థను స్థాపించడానికి కారణమయింది.

ఈ సంస్థ ద్వారా ఎంతో మంది తల్లిదండ్రులకు అండగా నిలబడుతూ ఆటిజంతో బాధపడుతున్న వారి పిల్లలకు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇంతటి గొప్ప సేవా కార్యక్రమాలు అందిస్తున్న డాక్టర్ శ్రీజా రెడ్డి నేడు పుట్టినరోజు సందర్భంగా ఆమెకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈమెకు దీర్ఘాయుష్షును ఇచ్చి మరింతకాలం ఇంకా ఇలాంటి ఎంతోమంది చిన్నారుల జీవితాల్లో వెలుగును నింపాలని ఆశిద్దాం.
" >

" >


" >


" >

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: