డా.శ్రీజారెడ్డి సేవలు అభినందనీయం..!
ఆటిజం రుగ్మత రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఎంత త్వరగా ఈ మానసిక సమస్యను గుర్తిస్తే అంత త్వరగా దీని నుంచి బయట పడవచ్చు. కేవలం ఒక్క వైద్యుడే దీన్ని హ్యాండిల్ చేయడం అనేది అసాధ్యం. పిల్లల డాక్టర్లు, సైకాలజిస్ట్, స్పీచ్ థెరపీస్ట్ ఇలా ఒక్కో లక్షణాన్ని అధిగమించేందుకు ఒక్కో డాక్టర్ కావాల్సి ఉంటుంది. ఈ మానసిక లోపాన్ని కాలక్రమేణా అధిగమించవచ్చు.
ఐతే తమ లాగా ఏ తల్లిదండ్రులు కూడా బాధపడకూడదని.. భావితరాల పిల్లలు ఈ మానసిక రుగ్మతకు బాధితులు కాకూడదని డాక్టర్. శ్రీజారెడ్డి చాలా బలంగా తపన పడ్డారు. ఆమె తపనే "పినాకిల్ బ్లూమ్స్" ఆటిజం థెరపీ సెంటర్ కి నాంది పలికింది. ఆటిజం థెరపీ, స్పీచ్ థెరపీ, అక్యూపెషనల్ థెరపీ, సైకాలజికల్ కౌన్సిలింగ్, స్పెషల్ ఎడ్యుకేషన్, డాన్స్ థెరపీ, యోగ థెరపీ, ఫిజియో థెరపీ ఇలా ఎన్నో చికిత్సలు అందిస్తున్న ఏకైక ఆటిజం థెరపీ సెంటర్ "పినాకిల్ బ్లూమ్స్" ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచింది.