హ్యాపీ బర్త్ డే శ్రీజారెడ్డి: వేల మంది ఆటిజం పిల్లలకి అండాదండా

Chaganti
ఒక మహిళ ఏమి చేయగలదు అని అనే కాలం నుండి మహిళ ఏదయినా చేయగలదు అనే స్థాయికి మహిళలు ఎదిగారు. అయితే ఆటిజం అనే ఎవరికీ పెద్దగా అవగాహన లేని సమస్యను ఎంచుకుని ఆ సమస్య ఉన్న పిల్లలు అందరికీ అండగా నిలుస్తున్నారు ఒక మహిళ.  ఆటిజం సమస్య పరిష్కారంపై నిరంతరం పోరాడి.. అనేక రోజుల పాటు రీసెర్చ్ చేసి ఆ సమస్య మీద అవగాహన తీసుకురావడంలో ఘన విజయం సాధించారు. ఆమె శ్రీజారెడ్డి సరిపల్లి, ప్రముఖ టెకీ.. కోటిరెడ్డి సరిపల్లి సతీమణి అయిన ఆమె ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆటిజం పిల్లల కోసం చేస్తున్న అంశాల గురించి తెలుసుకుందాం.

బుద్ధి మాంద్యాన్నే ఆటిజం అంటారు. ఇది చిన్నవయసులోనే చిన్నారులకు సంక్రమిస్తుంది. ఇందులో పిల్లలు రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చిన్న జ్వరం వస్తేనే బాధ పడే తల్లిదండ్రులకు ఆ పిల్లలను చూసి వారి ఎంత మనోవేదనకు గురవుతారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే అసలు ఈ ఆటిజం ఎందుకు వస్తుంది? ఎలా వస్తుంది? ఎలా పోతుంది? అనే ప్రశ్నలకు నేటికీ సమాధానం లేదు.. 1995 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 500 మంది చిన్నారుల్లో ఒక్కరు మాత్రమే ఆటిజంతో బాధపడేవారు. అయితే, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా 32 మంది చిన్నారుల్లో ఒకరినీ ఆటిజం వేధిస్తోంది. శ్రీజారెడ్డి - కోటిరెడ్డి దంపతుల కుమారుడు సంహిత్‌కు ఈ సమస్య వచ్చింది. ఏడాదిన్నర వయసులోనే సంహిత్‌లో వినికిడి లోపం లక్షణాలు కనిపించాయి.

 అయితే, తొలుత తమ కుమారుడి సమస్యపై కుంగిపోయి.. వేదన పడినా.. తర్వాత మాత్రం శ్రీజారెడ్డిలో పట్టుదల పెరిగి, తన కుమారుడిని ఈ సమస్య నుంచి బయట పడేయాలని ఉక్కు సంకల్పం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె అనేక మంది వైద్యులను కలిశారు. అయితే, దీనికి నేరుగా వైద్యం లేదని, ఒకవైపు వైద్య సేవలు తీసుకుంటేనే మరోవైపు ఫిజియోథెరపీ ద్వారా ప్రయత్నం చేయాలని తెలుసుకున్నారు. ఆ వెంటనే ఆమె ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. ఆటిజంలో ప్రధానమైన సైకలాజికల్ కౌన్సెలింగ్‌, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ ఇలా అనేక రూపాల్లో సేవలు అందాల్సి ఉంది. తమ కుమారుడికి ఇవన్నీ అందించారు. ఇక్కడే శ్రీజారెడ్డి మనసులో ఓ ఆలోచన మెరిసింది.
తామంటే.. వైద్యం కోసం డబ్బు పెట్టగలం కాబట్టి ఏది ఎక్కడ ఉన్నా.. వెళ్లి వైద్యం అందుకున్నామని, మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? వారు ఇలా తలా ఒకచోట విసిరేసినట్టుగా ఉన్న సేవలను ఇంత వ్యయ ప్రయాసలకోర్చి ఎలా సాధించుకుంటారు? అని భావించారు. అందుకే తామే ఒక సంస్థను ఎందుకు ఏర్పాటు చేయకూడదని భావించి అనుకున్నదే తడవుగా పినాకిల్ బ్లూమ్స్‌ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఆటిజంతో ఇబ్బంది పడుతున్న చిన్నారుల పాలిట వరంగా మారింది. అంధ ప్రదేశ్ తెలంగాణలో చాలా చోట్ల ఈ సంస్థ తమ బ్రాంచ్ లు ఏర్పాటు చేసి ఆటిజం పిల్లలకి అండగా నిలుస్తోంది.
" >


" >


" >


" >


" >

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: