ఆటిజం చిన్నారుల పాలిట.. శ్రీజారెడ్డి నిరుప‌మాన సేవ‌లు

Mamatha Reddy
కొన్ని సేవ‌ల‌కు కొల‌మానాలు ఉంటాయి. మ‌రికొన్ని సేవ‌ల‌కు నిర్దిష్ట స‌మ‌యాలూ ఉంటాయి. కానీ, ఆత్మీ య సేవ‌ల‌కు మాత్రం.. కొల‌మానాలు.. నిర్దిష్ట స‌మ‌యాలూ.. ఉండ‌వ‌నేందుకు.. పినాకిల్ బ్లూమ్స్ వ్య‌వ‌స్థా ప‌కురాలు.. డాక్ట‌ర్ స‌రిప‌ల్లి శ్రీజారెడ్డి నిద‌ర్శ‌నం. స‌మాజంలో చిన్నారుల పాలిట అత్యంత భ‌యంక‌ర‌మైన స‌మ‌స్య ఆటిజం! బుద్ధిమాంద్యంతో పాటు చిన్న‌ప్పుడే వినికిడి స‌మ‌స్య‌, మాట్లాడ‌క‌పోవ‌డంతో పాటు అనేక స‌మ‌స్య‌ల‌తో జ‌న్మించే చిన్నారుల‌కు తాము ఏం చేస్తున్నారో.. ఏం మాట్లాడాలో .. ఎలా మాట్లాడాలో.. ఎలా ప్ర‌వ‌ర్తించాలో కూడా తెలియదు. ఇలాంటివారికి అనే రూపాల్లో ప‌రిష్కారం చూపించాలి.
వారి ఆక‌లి ద‌ప్పిక‌లు, వారి బాధ‌లు, వారి ఇబ్బందులు కూడా మ‌న‌కు తెలియ‌వు.. వారు చెప్ప‌లేని. ఇలాంటి ప‌రిస్థితిలో ఉన్న పిల్ల‌ల త‌ల్లిదండ్రుల బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. అయితే.. ఈ ఆటిజంలో ఎదుర‌య్యే అనేక స‌మ‌స్య‌ల‌కు ఒకే వేదిక‌పై స‌మ‌స్య‌ల ప‌రిష్కారం.. శ్రీజారెడ్డి దారి చూపే వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు. అంతేకాదు.. ఆటిజం స‌మ‌స్య‌ల్లో స్పీచ్ థెర‌పీ.. వంటి కీల‌క‌మైన వాటికి విదేశాలే గ‌తి! అది కూడా వ్య‌య‌ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకోవాల్సిన ప‌రిస్థితి. దీంతో పేద‌లు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు చెందిన చిన్నారుల‌కు ఆటిజం స‌మ‌స్య ఓ జీవిత‌కాల శిక్ష‌గా ఉండేది.
ఈ క్ర‌మంలో త‌మ కుమారుడికి వ‌చ్చిన ఆటిజం స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూసుకునే క్ర‌మంలో దేశ విదేశాల్లో ఉన్న వైద్య రీతుల‌ను గ‌మ‌నించారు.అంతేకాదు.. తాను కూడా స్వ‌యంగా అధ్య‌య‌నం చేసి.. తెలుగునాట తొలిసారి.. ఆటిజం స‌మ‌స్య ప‌రిష్కా రానికి పినాకిల్ బ్లూమ్స్ ఏర్పాటు చేశారు శ్రీజారెడ్డి. దీనిద్వారా.. స్పీచ్ థెర‌పీ.. గుర్తింపు, ఆలోచ‌న, ఆట‌లు.. ఇలా అనేక రూపాల్లో ఆటిజం చిన్నారుల‌కు చికిత్స‌ను ఒకే వేదిక‌పై అందిస్తున్నారు. త‌ద్వారా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చికిత్స‌ను చిన్నారుల‌కు చేరువ చేశారు. ప్ర‌స్తుతం పినాకిల్ బ్లూమ్స్ ద్వారా వేలాది మంది చిన్నారులు త‌మ జీవితాను పండించుకునేందుకు శ్రీజారెడ్డి దారి చూపిన‌ట్టు అయింది. అందుకే ఆమె సేవ‌లు.. ఆటిజం చిన్నారుల పాలిట అజ‌రామ‌రం అన‌డంలో సందేహం లేదు..!

" >

" >

" >



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: