థెరిస్సా కాదు.. కానీ, శ్రీజారెడ్డీ `మ‌ద‌రే`.. ఆమె ఓ సంచ‌ల‌నం

Mamatha Reddy
ప్ర‌పంచానికి అమ్మ‌గా పేరొందిన మ‌ద‌ర్ థెరిస్సా.. ఇప్పుడు మ‌న మ‌ధ్య లేరు..!  కానీ.. ఆమె చూపిన బాట‌లో ఆమె చూపిన ఔదార్యం.. సేవా భావాన్ని ఆలంబ‌న‌గా చేసుకుని ముందుకు సాగుతున్న వారు చాలా మంది మ‌న మ‌ధ్య ఉన్నారు. అయితే.. వీరిలోనూ ఎంతో అంకిత భావంతో.. స‌మాజ సేవ‌లో నిబ‌ద్ధ‌త‌తో వ్య‌వ‌హ‌రించే వారు మాత్రం చాలా త‌క్కువ మంది ఉన్నారు. ఇలాంటి వారే అభిన‌వ థెరిసాలుగా స‌మాజంలో కీర్తించ‌బ‌డుతున్నారు. ఇలాంటి వారిలో ఒక‌రుగా నిలుస్తున్నారు పినాకిల్ బ్లూమ్ వ్య‌వ‌స్థాప‌కురాలు.. డాక్ట‌ర్ స‌రిప‌ల్లి శ్రీజారెడ్డి.
ఎవ‌రో ఒక‌రు ఎప్పుడో అప్పుడు.. న‌డ‌వ‌రా ముందుగా..!! అన్న విధంగా.. శ్రీజారెడ్డి త‌న స‌మ‌స్య‌ను స‌మాజ స‌మ‌స్య‌గా మ‌లుచుకున్నారు. త‌న క‌న్నీటి ఆవేద‌న‌ను.. ప‌రిష్క‌రించుకుంటూనే.. మ‌రెంతో మంది త‌ల్లుల క‌న్నీటిని తుడిచే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలోనే ఆమె హైద‌రాబాద్ కేంద్రంగా పినాకిల్ బ్లూమ్స్‌ సంస్థ‌ను స్థాపించి.. స‌మాజ హితం కోసం పాటు ప‌డుతున్నారు. త‌న కుమారుడు సంహిత్ హియ‌రింగ్ స‌మ‌స్య‌తో ఉన్న నేప‌థ్యంలో ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు దేశ‌వ్యాప్తంగా తిరిగి ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకున్నారు.
ఈ క్ర‌మంలో దేశంలో అప్ప‌టి వ‌ర‌కు లేని చికిత్సా విధానాల‌ను ఒకే చోట‌కు చేర్చి.. ఆటిజంతో బాధ‌ప‌డుతున్న చిన్నారుల‌కు అన్ని సేవ‌ల‌ను ఒకే గొడుగు కింద‌కు చేర్చారు శ్రీజారెడ్డి. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలోని దాదా పు అన్ని రాష్ట్రాల నుంచి పినాకిల్ బ్లూమ్స్‌కు వ‌చ్చి.. త‌మ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకున్న చిన్నారులు .. వేలాదిగా ఉన్నార‌నండంలో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.
అయితే.. ఈ సంస్థ‌ల‌ను కూడా మ‌రింత‌గా విస్త‌రించేందుకు శ్రీజారెడ్డి చేసిన కృషి ఫ‌లించింది. ముఖ్యంగా తెలుగు ప్రాంతాల‌కు చెందిన వారి ప‌ట్ల మ‌రింత అభిమానాన్ని చూపిస్తూ.. ఈ సంస్థ‌ల‌ను విస్త‌రిస్తూ.. చిన్నారుల పాలిట మ‌రో `మ‌ద‌ర్‌`గా మారుతున్నారు శ్రీజారెడ్డి. ఆమె సేవ‌ల‌కు యావ‌త్‌చిన్నారి లోకం హ‌ర్షం వ్య‌క్తం చేస్తోంది.

" >

" >

" >



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: