'బరువు' తగ్గించే 'చట్నీ'.. ఏంటో తెలుసా?

Durga Writes

బరువు తగ్గాలి అనుకుంటున్నారు.. కానీ తగ్గలేకపోతున్నారు. కారణం రోజు తినే ఆహారం. మనం తినకుండా ఎలాగో ఉండలేము.. కాబట్టి తినే ఆహారంలోనే బరువు తగ్గించే గుణాలు ఉంటె సరిపోతుంది. కదా! అందుకే బరువు తగ్గే ఆహారాన్నే తీసుకోండి. అయితే ఈరోజు టిఫిన్స్ లో తినే చట్నీ గురించి తెలుసుకుందాం.

 

బరువు తగ్గాలి అనుకునే వారు కరివేపాకు చట్నీ తింటే సరిపోతుంది. ఆ చట్నీ ఈజీగా బరువు తగ్గించేస్తుంది. అయితే అలాంటి ఈ కరివేపాకు చట్నీని ఎలా చేసుకొని తినాలో తెలుసా? ఏలా చేసుకొని తింటే బరువు తగ్గుతారో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్థాలు... 

 

కరివేపాకు - 2 కప్పులు, 

 

పచ్చికొబ్బరి తురుము - ముప్పావు కప్పు, 

 

చింతపండు గుజ్జు - 1 టీ స్పూను, 

 

ఎండుమిర్చి - 3, 

 

ఇంగువ - చిటికెడు, 

 

వెల్లుల్లి రేకలు - 2, 

 

నూనె - 1 టేబుల్‌ స్పూను, 

 

ఉప్పు - రుచికి తగినంత.

 

తయారీ విధానం...  

 

నూనెలో ఎండుమిర్చి, వెల్లుల్లి రెండు నిమిషాలు వేగించి కరివేపాకు, కొబ్బరి తురుము, ఇంగువ, చింతపండు గుజ్జు, ఉప్పు వేసి 3 నిమిషాల తర్వాత మంట ఆపేసి.. అది చల్లారిన వెంటనే మిక్సీలో వెయ్యాలి. అంతే బరువు తగ్గించే కరివేపాకు పచ్చడి రెడీ అయిపోతుంది. అయితే ఈ పచ్చడిని వేడి వేడి అన్నంతో కలిపి తింటే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇంకేందుకు ఆలస్యం.. చట్నీ తినాల్సిన సమయం వచ్చిన ప్రతిసారి ఈ చట్నీని తినండి. బరువు తగ్గండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: