విజయం మీదే: వ్యాపారంలో సక్సెస్ అవ్వడానికి ఇలా చేయండి ?

VAMSI
చాలా మందికి వ్యాపారం చేయాలని ఉంటుంది, కారణం ఇక్కడ తక్కువ సమయంలోనే అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా మంది ఆకర్షితులు అయినా కానీ తక్కువ మంది మాత్రమే వ్యాపార రంగం వైపు అడుగు వేస్తారు. కారణం ఇక్కడ గెలుపుకు ఎంత స్కోప్ వుంటుందో, ఓటమికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. అయితే వ్యాపారంలో నిలదొక్కుకుని కోరుకున్న విజయాన్ని అందుకోవడం ఎలా అన్న దానికి ఇక్కడ కొన్ని ముఖ్య సలహాలను తెలుసుకుందాం. వ్యాపారంలో ఎంత పెట్టుబడి పెట్టాం అన్నది కాదు కస్టమర్ మనల్ని గుర్తించడం ముఖ్యం. లక్షలు పెట్టుబడి పోసినా కస్టమర్ మనల్ని గుర్తించకపోతే వ్యాపారం ముందుకు సాగదు.
అందుకే వ్యాపారం లోని కొన్ని నైపుణ్యాలను తెలుసుకొని బిజినెస్ చేస్తే ఫలితం అందుతుంది. ముందుగా లాయల్ కస్టమర్స్ ను అట్రాక్ట్ చేసుకోవాలి. అనగా నిజాయితీ గల కస్టమర్లు, వీరు ఒకసారి ఒక షాపుకు అలవాటు పడ్డారు అంటే మళ్ళీ మళ్ళీ వస్తారు. ఇతరులకు అక్కడే కొనండి అని సలహా ఇచ్చి మన బిజినెస్ కు వారు పబ్లిసిటీ పెంచుతారు. అయితే ఈ లాయల్ కస్టమర్స్ ను ఆకర్షించడానికి ఉత్తమమైన మార్గం నాణ్యమైన సరుకు, ఆమోదయోగ్యమైన ధరలు, డిస్కౌంట్లు, ఏదైనా స్పెషల్ గా ఉండేలా ఎక్సట్రా గిఫ్ట్స్ లాంటివి ఆఫర్ చేయాలి.
అలాగే కన్సేషన్ పద్దతి .. ఈ తేదీ లోపు కొనుగోలు చేసే వస్తువులకు ఇంత డిస్కౌంట్ లేదా ఫ్రీ గిఫ్ట్ ఇలాంటివి ....ఇచ్చే ప్రొడక్ట్ కి ధర తగ్గించడం పెద్దగా ఎఫెక్టివ్ అనిపించక పోవచ్చు. కానీ దానికి బదులుగా వేరొక చిన్న వస్తువు ఇచ్చినా కస్టమర్ అట్రాక్ట్ అయ్యేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అలాగే ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ తో మీ బిజినెస్ ఆన్లైన్లో ఉండడం కూడా ముఖ్యమే. ఇప్పట్లో చిన్నాచితకా వ్యాపారాలు కూడా ఆన్లైన్ మార్కెటింగ్ లోకి జాయిన్ అవుతున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: