విజయం మీదే: విజయమే నిజమైన ఆస్థి...

VAMSI
సంతోషంగా జీవించాలని, అనుకున్న వాటిని అందుకుని ఆనందంగా బ్రతకాలని అందరికీ ఉంటుంది. కానీ జీవితమనే చదరంగంలో అందరూ ఒకేలా ఉండలేరు. అలాగే ఒకేలా జీవించ లేరు. సంపన్నులు ఉన్న ఇదే నెలపై కడు పేద వాడు కూడా జీవిస్తున్నారు. బంగారు పళ్ళెంలో భోజనం చేయగల ధనవంతులు ఉన్న ఇదే నేలపై పట్టెడు అన్నం కోసం అలమటించే ప్రజలు ఉన్నారు. కొందరు సంతోష సాగరంలో మునిగి తేలుతూ ఉంటే, మరి కొందరు కన్నీటి సంద్రంలో ఏమి చేయాలో పాలు పోక రోదిస్తున్నారు. ఇలా ఎందరో, ఎన్నెన్నో రకాలుగా జీవిస్తుంటారు. ఒక్కొక్కరి జీవితం ఒక్కోలా ఉంటుంది. అందరికీ సౌకర్యవంతమైన జీవితం పొందే అవకాశం లేకపోవచ్చు.
కానీ ఆ అవకాశాన్ని అంది పుచ్చుకునే తెగువ చూపించిన క్షణమే ఆనందం మీ దరి చేరుతుంది. విజయం మీ వెన్నంటే ఉంటుంది. అయితే ఇది అంత ఈజీనా అంటే అవునని చెప్పలేము, అలాగే కాదని క్లారిటీ ఇవ్వలేము. ఒక్కో సందర్భంలో వారి వారి జీవిత ప్రయాణాలపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా అన్నిటినీ ఆహ్వానించి తమకు నచ్చిన జీవితం కోసం ప్రయత్నించే వారు సక్సెస్ ను సొంతం చేసుకోగలరు. సమస్య చిన్నదైనా పెద్దదైనా సరే అదే మిమ్మల్ని మీ విజయం వరకు అడుగులు వేసేలా చేస్తుంది. సాహసం , సమయ స్పూర్తి, స్వయంకృషి వీటన్నిటినీ అవసరమైన సమయంలో వాడుకుంటూ కష్టపడితే ఎంత కఠినమైన పనైనా ఇట్టే అందుకోగలరు.  
అందరితో పాటు ఒకరిగా కాకుండా అందరిలో ప్రత్యేకంగా ఉండటం అనేది మీ చేతుల్లో ఉన్న విషయం అని గుర్తించాలి. అనుకున్నది సాధించే వరకు ధైర్యాన్ని కోల్పోకూడదు. కాలం ఎన్నో సమస్యలను అవాంతరాలను సృష్టించవచ్చు. కానీ ప్రతి ఒక్క వ్యక్తిలో చైతన్యం నింపుకుని దైర్యంగా ముందుకు సాగినపుడే సంతోషం మీ చెంత చేరుతుంది, విజయం మీ పేరు ముందు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: