సంస్థాధినేతలకు భిన్నం.. మా 'కోటి' సర్

VAMSI
వ్యక్తి యొక్క ప్రతిభను, ఉన్నతిని వ్యక్తీకరించేది కేవలం వారి చదువు మాత్రమే కాదు. అంతకు మించిన ఆత్మ స్థైర్యం. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, పది మందికి సాయపడాలనే ఆలోచన, అన్నిటికి మించి మనపై మనకు పూర్తి విశ్వాసం ఉంటే విద్యతో సంభందం లేకుండా లక్ష్యాన్ని సాధించవచ్చు, ఉన్నత శిఖరాలను అధిరోహించి విజయ పథకాన్ని ఎగురవేయవచ్చు అని నిరూపించారు Dr. reddy SARIPALLI' target='_blank' title='కోటి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోటి రెడ్డి సరిపల్లి. విద్య అనేది అర్హత మాత్రమే కాని జీవితం అనే పోరాటంలో మన ఆత్మస్థైర్యమే ఆయుధమని,  ఆయన జీవితమే దీనికి నిదర్శనం అని చాటి చెప్పారు కోటి రెడ్డి. ఆయన చదివింది పదో తరగతే, కానీ పీజీలు చదివినా రాని తెలివి, వివేకం ఆయన సొంతం. ఆయన ప్రతిభకు సర్టిఫికెట్లు అడ్డుపడలేవని  నిరూపించి పదో తరగతి మాత్రమే చదివిన ఆయన మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగం సంపాదించారు. ఆ కంపెనీలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నత గుర్తింపు పొందారు.
అంతటితో ఆగిపోలేదు ప్రపంచ ప్రఖ్యాత సంస్థలో ఉద్యోగం పొందినప్పటికీ అది ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదు. పదిమందికి సాయం చేయాలనే సంకల్పంతో సొంతంగా కంపెనీని ప్రారంభించి అభివృద్ధి చేశారు. కోటి గ్రూప్ ఆఫ్ వెంచర్స్ పేరుతో పలు సంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించి వారి కుటుంబాలకు అండగా నిలబడ్డారు. విద్య, వైద్య, మీడియా, వ్యవసాయం ఇలా పలు రంగాల్లో కంపెనీలు స్థాపించి తన దేశ ప్రజలకు సేవ చేస్తూ అందులోని సంతోషాన్ని వెతుక్కుంటున్న మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ కోటి రెడ్డి. మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అన్న ఫిలాసఫీ ఫాలో అవుతూ ఎంతో సాధారణమైన జీవితాన్ని గడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచారు శ్రీ reddy SARIPALLI' target='_blank' title='కోటి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోటి రెడ్డి గారు.
ఈ ప్రపంచంలో ఎన్నో సంస్థలు మనుషులకు ఉపాధి కల్పిస్తున్నాయి. కానీ వాటన్నింటికీ భిన్నంగా ప్రతి ఒక్క ఉద్యోగితో యజమానిలాగా వ్యవవహరించకుండా, ఒక సాటి ఉద్యోగిలా ఒక స్నేహితుడిలా, ఒక కుటుంబ సభ్యుడిలా మెలుగుతూ అందరినీ ముందుండి ఉన్నత శిఖరాలవైపు నడిపిస్తూ కోట్లాదిమంది మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారు కోటి సార్. ఈయనను స్ఫూర్తిగా తీసుకుని ఆయన సతీమణి శ్రీజరెడ్డి సరిపల్లి కూడా సేవా రంగంలో అడుగుపెట్టి ప్రపంచం లోని పలు దేశాలలో ఎంతో మంది ఆటిజంతో ఇబ్బంది పడే చిన్నారులకు ఆరోగ్య సేవలు అందిస్తూ ఆదర్శ మహిళగా, ఆదర్శ గృహిణిగా పేరు ప్రఖ్యాతులు పొందారు. ఈయన విజయ ప్రస్థానం అందరికీ ఒక గొప్ప ఆదర్శం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: