మట్టిలో మాణిక్యం.. కోటి మందికి ఆదర్శంగా ' కోటిరెడ్డి ' అడుగులు...!

VUYYURU SUBHASH

సాధించిన దానికి సంతృప్తిని చెంది.. ఇదే విజ‌య‌మ‌ని ఆయ‌న అనుకోలేదు. రేప‌టి రోజు కోసం స్వ‌ప్నించారు. నాకోసం కాదు.. ఈ స‌మాజానికి ఏదైనా చేయాల‌ని ల‌క్ష్యాలు నిర్దేశించుకున్నారు. ఆ ల‌క్ష్యాలు.. ఆ క‌ల‌లే.. స‌మాజ హితం దిశ‌గా అడుగులు వేసేలా చేశాయి. ఆశ‌యాల దారుల్లో ఆద‌ర్శాల‌ను సోపానాలుగా చేసుకుని అభివృద్ధిని కాంక్షించిన ప్ర‌పంచ మేటి టెకీగా ఆయ‌న గుర్తింపు సాధించారు. స‌మాజంలో పేరు సంపాయించుకుని.. స‌మాజం నాకేమిచ్చింది అనే మాట‌ను వ‌దిలేసి స‌మాజం కోసం నేనేం చేశాన‌నే ప్ర‌శ్న‌ను వేసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు స‌రిప‌ల్లి కోటిరెడ్డి..!

 

నేను-నా వాళ్లు- అనే స‌హ‌జ‌సూత్రానికి భిన్నంగా.. నేను-స‌మాజం అనే వ‌సుధైక సూత్రాన్ని అణువ‌ణువునా ఆపాదించుకున్న అధ్బుత్వ మూర్తిమ‌త్వం స‌రిప‌ల్లి కోటిరెడ్డి. పుట్టింది రాజ‌కుమారుడుగా కాదు.. పెరిగిందీ రాజ‌కుమారుడుగాకాదు.. మ‌ట్టి పిసికే చేతుల్లో పెరిగిన కోటిరెడ్డి.. మాణిక్యంలా వెలుగొందారు. త‌న‌లో ఏర్ప డిన నిరాశ‌, నిస్పృహ‌ల కొలిమిలిలో ఆశ‌లు మ‌రిగించి ఆశ‌యాల‌ను వెలికి తీశారు. ఫ‌లితంగా ఈ స‌మాజా నికి అవ‌స‌ర‌మైన మ‌న‌సున్న వ్య‌క్తి ల‌భించారు. ఆయ‌నే కోటిరెడ్డి. కొంద‌రు త‌మ‌కోసం జీవిస్తారు. మ‌రికొంద‌రు త‌మ వారికోసం బ‌తికితే చాల‌నుకుంటారు. కానీ, కోటిరెడ్డి క‌ల‌లు అక్క‌డితో ఆగిపోలేదు.

 

త‌న‌వారితోపాటు.. త‌న చుట్టూ ఉన్న‌వారు కూడా త‌న‌లాగే బ‌త‌కాల‌ని కాంక్షించారు. దీనినుంచే అనేక సంస్థ‌లు పుట్టుకొచ్చారు. చిన్న మొక్క‌గా మొద‌లైన స‌రిప‌ల్లి ప్ర‌స్థానం.. నేడు వ‌ట వృక్ష‌మై.. కొన్ని వంద‌ల మందికి ఆశ్ర‌యం క‌ల్పిస్తోంది. కొన్ని వేల కుటుంబాల్లో ఆనందాన్ని పంచుతోంది. స‌మాజానికి దిశానిర్దేశం చూపిస్తోంది. అనేకానేక సంస్థ‌ల‌తో పాటు మీడియా రంగంలోనూ ఆయ‌న‌ది అందెవేసిన చేయి. కేవ‌లం ఒకే ఒక్క‌డితో ప్రారంభ‌మైన ఇండియా హెరాల్డ్ పోర్ట‌ల్ నేడు భార‌త‌దేశంలో ప‌లు భాష‌ల్లోకి విస్త‌రించి కొన్ని కోట్ల మంది పాఠ‌కుల మ‌న‌స్సుల‌ను గెలుచు కుంటోంది.

 

ఈ రోజు హెరాల్డ్‌లో వ‌చ్చిన వార్త అంటే ప్ర‌జ‌ల్లో ఎంతో న‌మ్మ‌కం క్రియేట్ అయ్యింది. ఇది 12 ఏళ్ల ఎంతో న‌మ్మ‌క‌మైన కృషికి తార్కాణం. నేడు ప్ర‌పంచాన్ని శాసిస్తున్న టెక్నాలిజీ రంగంలో ఆయ‌న‌ది ప్ర‌త్యేక అధ్యాయం. నేను ఉన్నాను.. నేను విన్నాను అనే మాట .. కేవ‌లం రాజ‌కీయాల‌కే కాదు.. సామాజిక దృక్ఫ‌థం ఉన్న కోటిరెడ్డి వంటి న‌వ తేజాల‌కు కూడా వ‌ర్తిస్తుంద‌ని నిరూపించారు. ఆయ‌న ఆశ‌యం.. ఆద‌ర్శం.. ఈ స‌మాజానికి ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఎప్ప‌టికీ ప‌ట్టుకొమ్మే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: