రీల్స్ పిచ్చి.. నడిరోడ్డుపై నగ్నంగా యువతి.... పబ్లిక్ రియాక్షన్ ఇదే
మొన్నటి వరకు రీల్స్ అంటే పాటలకు డాన్స్ చేయడం చూశాం కానీ ఇప్పుడు ప్రాణాలు పోయే సాహసం చేస్తూ వీడియోలు చేస్తున్నారు. పక్కవారి కంటే మేమే కొత్తగా కనిపించాలని పిచ్చి చేష్టలతో చెలరేగి పోతున్నారు. ఇంట్లో కూర్చుని చేస్తే ఎవరు చూస్తారులే అనుకొని కొందరు నడిరోడ్డుపై జనం తిరిగే ప్రదేశాల్లోనే వీడియోలు చేస్తున్నారు. మరికొందరు భగ్న ప్రేమికులు తమకు ప్లేస్ దొరకట్లేదు అన్నట్లుగా రోడ్డుపైనే కార్లు- బైకులపైనే రొమాన్స్ కు దిగుతున్నారు. మరికొందరు రోడ్లపై ప్రయాణించే వారికి లేనిపోని ఆటంకాలు కలిగిస్తూ వీడియోలు చేస్తున్నారు.
ఇదే క్రమంలో ఓ అమ్మాయి ఒంటిపై సగం దుస్తులు వేసుకుని రీల్స్ చేసింది మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో ఓ యువతి అందరూ ఆశ్చర్యపోయే విధంగా నడి రోడ్డు పై తన ఒంటేపై ఉన్న దుస్తులు ఒక్కోటి విప్పుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిపోయింది. అలా అమ్మాయి నడుచుకుంటూ వెళ్లేసరికి ఒకసారి అందరు షాక్ అయిపోయారు. కొందరు ఈ ఘోరాన్ని చూడలేక కళ్ళు మూసుకున్నారు మరికొందరు మాత్రం అలానే చూస్తూ ఉండిపోయారు. ఇదంతా ఆమె కేవలం రీల్స్ కోసమే చేసిందని తెలియడంతో ఆ వీడియో చూసిన ఆమెపై తిట్ల వర్షం కూరిపించిరు.మరికొందరు ఆమెపై పోలీసు కు కంప్లీట్ చేశారు. సోషల్ మీడియాలో రీల్స్ పిచ్చిలో పడి ఇలా చేయడం ద్వారా సమాజానికి చెడ్డ పేరు వస్తుందని ముఖ్యంగా ఇలాంటి వీడియోలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వాపోతున్నారు.