యాక్.. ఇది చూస్తే ఇంకోసారి మీరు ఫేషియల్ మసాజ్ చేయించుకోరు?

praveen
ఇటీవల కాలంలో ఎంతోమంది తమ అందాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు బ్యూటీ పార్లర్ కు వెళ్తున్నారు. అయితే ఎంతో మంది పురుషులు కూడా ఇక తమ ఫేస్ పై ఉన్న ట్యాన్ తొలగించుకునేందుకు ఏకంగా ఫేస్ వాష్ లేదా ఫేస్ మసాజ్ లను చేయించుకోవడం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే  అయితే ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే.. మాత్రం మరోసారి ఫేస్ వాష్ చేయించుకోవాలంటే భయపడి పోతారు.

 ఎందుకంటే ఏకంగా నోటిలోని ఉమ్మితో ఒక వ్యక్తి కస్టమర్ కి పేస్ వాష్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది  ఉత్తరప్రదేశ్లోని షామిలిలో ఈ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక బార్బర్ కు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోవడంతో.. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏకంగా ఈ వీడియోలో ఒక వ్యక్తి కస్టమర్ కి ఫేషియల్ మసాజ్ చేస్తూ ముఖానికి ఉమ్మి రాసిన దృశ్యం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్స్ అందరు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ఈ మధ్యకాలంలో ప్రతి బార్బర్ షాప్ లో కూడా ఎంతోమంది ఆయిల్ మసాజ్, ఫేస్ మసాజ్ అనేది చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఇలాగే ఫేస్ మసాజ్ చేయించుకున్నాడు. అయితే ముందు అతని ముఖానికి క్రీం రాసిన సదరు వ్యక్తి.. ఆ తర్వాత నోట్లో నుంచి ఉమ్మిని చేతుల్లోకి తీసుకొని.. అది కూడా అతని మొఖానికి రాసేశాడు. ఇది చూసి యాక్ ఛీ అంటున్న నేటిజన్స్ చివరికి ఆ బార్బర్ తీరుపై మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఈ వీడియో చూస్తే మీరు మరోసారి ఫేషియల్ మసాజ్ చేయించుకోవాలంటే భయపడిపోతారేమో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: