వారెవ్వా.. ఎగిరే బైక్ వచ్చేసింది.. వైరల్ వీడియో?

praveen
ఇటీవలి కాలంలో వాహనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లు జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.  ట్రాఫిక్ జామ్ కారణంగా ఎప్పుడు ఎంతో మంది గంటల సమయం ప్రతిరోజు వృధా చేస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా ప్రతి ఒక్కరు సంవత్సరంలో 209 గంటలు ట్రాఫిక్ అంతరాయం కారణంగా వృధా చేస్తున్నారు అన్న విషయం సర్వేలో కూడా వెల్లడైంది.  సాధారణంగా రోడ్డుపై వెళితే ట్రాఫిక్ జామ్ ఉంటుంది. అలాంటిది గాల్లో ఎగిరితే ట్రాఫిక్ లేకుండా రయ్యి రయ్యి మంటూ దూసుకు పోవచ్చు.

 మీరు చెప్పే ఐడియా బాగానే ఉంది కానీ గాల్లో ఎగిరే వాహనాలు బైక్ లు కార్లు లేవు కదా అని అంటారు ఎవరైనా. కానీ ఇప్పుడు మాత్రం గాల్లో ఎగిరే బైక్ కూడా వచ్చేసింది అన్నది మాత్రమే అర్థమవుతుంది. ఎంతో తేలికగా గాల్లో తేలి పోవడమే కాదు రయ్యి రయ్యి మంటూ దూసుకుపోయే బైక్ ని  తయారు చేసారు. రాబోయే కాలంలో ఎగిరే కార్లు బైకులు ఉపయోగించ బోతున్నారు అన్నది తరచూ చదువుతూనే ఉన్నాము. ప్రపంచంలోనే తొలిసారిగా ఎగిరే బైక్ ను కనుగొన్నారు. జపాన్ కు సంబంధించిన సంస్థ ఫ్లయింగ్ బైక్ ని కనుగొంది.  వచ్చే ఏడాది యూఎస్ఏలో ఈ బైక్ను విడుదల చేయబోతోంది అనేది తెలుస్తుంది.

 అమెరికాలో జరిగిన ఆటో షోలో ఇక ఈ బైక్ ప్రదర్శన చేశారు. దీంతో ఈ ప్రదర్శనలో ఈ బైక్ గాల్లో ఎగరడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియోలో చూసుకుంటే ఒక వ్యక్తి బైక్ పై కూర్చొని తిరుగుతున్నట్లు మనం చూడవచ్చు.
 కాగా ఈ బైక్ వివరాలు ఇలా ఉన్నాయి. Aerwins XTurismo 3.7 m (146 in) పొడవు, 2.4 m (94.5 in) వెడల్పు, 1.5 m (59 in) ఎత్తు. ఇది గరిష్టంగా 60 mph (97 kph) వేగంతో 30 నుంచి 40 నిమిషాల పాటు గాలిలో ప్రయాణించగలదు. బైక్ బరువు 300 కిలోలు. ఇందులో కార్బన్ ఫైబర్ మెటీరియల్ ఉపయోగించారట. ఇది 100 కిలోల పేలోడ్ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ బైక్ ఇప్పటికే జపాన్‌లో అమ్మకానికి ఉందట. వచ్చే ఏడాది యునైటెడ్ స్టేట్స్‌లో విక్రయించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ ఎగిరే బైక్ ధర 777,000 డాలర్లు (దాదాపు రూ. 6.19 కోట్లు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: