రియల్ లైఫ్ బాహుబలి.. ఏం చేసాడో చూస్తే షాకే?

praveen
బాహుబలి.. ప్రభాస్ హీరోగా జక్కన్న దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా చూసిన తర్వాత అది బలవంతుడిని ఎవరిని చూసినా సరే ఇక ముందుగా వినిపించే పేరు బాహుబలి అని. రియల్ లైఫ్ బాహుబలికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటివరకు ఎన్నో రకాల వార్తలు వైరల్ గా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేస్తూ తమ బలప్రదర్శన తో అందరిని ఆశ్చర్యానికి గురి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు ఎంతమంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వెలుగులోకి వస్తూనే ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తోంది. అంతేకాదు ఇక్కడ ఒక వ్యక్తి బల ప్రదర్శన చేసిన తీరు చూసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా ద్విచక్ర వాహనం కింద పడితే దాని పైకి లేపడానికి ఎంతో మంది ఆపసోపాలు పడి పోతూ ఉంటారు. ఇక అలాంటిది రెండు చేతులలో ద్విచక్ర వాహనాన్ని గాల్లోకి లేపడం అంటే అది అసాధ్యం అని చెప్పాలి. కానీ కొంతమంది మాత్రం ఇలాంటివి చేసి ఏకంగా రియల్ లైఫ్ బాహుబలి అనే పేరు సంపాదించుకుంటారు.

 ఇక్కడ ఒక వ్యక్తి కూడా ఇలాంటిదే చేసి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోయాడు అని చెప్పాలి. సాధారణంగా ఒక ద్విచక్రవాహనాన్ని చేతులతో పైకి ఎత్తడమే చాలా కష్టం అంటే ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఏకంగా వాహనాన్ని చేతులతో తల మీద పెట్టుకుని లాటర్ పైన ఒక్కో మెట్టు ఎక్కుతూ బస్సు పైకి చేరుస్తూ ఉన్నాడు. ఇందుకు సంబంధించిన ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇలా 150 కిలోల బరువున్న బైక్ ను అవలీలగా ఎత్తి కాదు బస్సు పైకి చేరుస్తున్న అతన్ని చూసి రియల్ లైఫ్ బాహుబలి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: