నువ్వు నేను బెస్ట్ ఫ్రెండ్స్.. హృదయాన్ని హత్తుకుంటున్న వీడియో?

praveen
ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్న స్నేహబంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే రక్త సంబంధం లేకపోయినప్పటికీ అంతకుమించి అనే ప్రేమానురాగాలు స్నేహబంధం లో ఉంటాయి అని అంటూ ఉంటారు. ఇక ఈ విషయం ఎంతో మంది స్నేహితులను చూస్తే నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. అయితే మనుషుల జంతువుల మధ్య కూడా ఇలాంటి స్నేహబంధం ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జాతి వైరాన్ని సైతం పక్కనపెట్టి ఎంతో స్నేహంగా మెలిగే జంతువులకు సంబంధించిన వీడియోలు ఇప్పటివరకు ఎన్నో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాయ్.

 ఇక ఇలా ఒకే జాతికి సంబంధించిన జంతువులు స్నేహంగా ఉండటం చూస్తూనే ఉంటాం. కానీ రెండు జాతులకు సంబంధించిన జంతువులు.. అటు చరిత్రలో ఎక్కడా స్నేహంగా మెలగని జంతువులు బెస్ట్ ఫ్రెండ్స్ గా కనిపిస్తే ఇక అది చూసిన అందరి మనసు పులకరించిపోతుంది అనే చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా ఒక చింపాంజీ జాతి వైరాన్ని మరచి ఒక తాబేలు తో స్నేహం చేసింది. అచ్చంగా ఇద్దరు వ్యక్తుల మధ్యమంచి స్నేహ బంధం ఉంటే బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎలా చెప్పుకుంటారో.. ఇప్పుడు వైరల్ గా మారిన వీడియో చూసిన తర్వాత చింపాంజీ తాబేలు బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటారు ఎవరైనా.

 సాధారణంగా చింపాంజీలు చాలా మటుకు మనుషుల్లానే ప్రవర్తిస్తూ ఉంటాయ్. మనుషులు చేసే ఎన్నో పనులను చేస్తూ అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటాయన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇక మనుషుల లాగానే ఎమోషన్స్ కూడా చూపిస్తూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు చింపాంజీలు చేసే పనులు హృదయాన్ని హత్తుకుంటాయి. ఇటీవలే వైరల్ గా మారిన వీడియో లో భాగంగా ఒక చింపాంజీ చేసిన పని హృదయాలను తాకుతుంది. ఓ చింపాంజీ యాపిల్ తింటూ కనిపించింది. ఇక స్నేహితులు తమ తినే ఆహారాన్ని పక్కనే ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ కి షేర్ చేసినట్లుగానే చింపాంజీ పక్కనే ఉన్న తాబేలుకూ యాపిల్ తినిపించింది. ఇక ఇది చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: