ఘోరమైన రోడ్డు ప్రమాదం.. గగుర్పాటుకు గురి చేసే వీడియో?

praveen
ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతుంది అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేస్తూ ఉండడంతో రోడ్డు ప్రమాదాలకు కారణం అయ్యి వేరొకరి ప్రాణాలను ప్రమాదంలో పడడం లేదా తమ ప్రాణాలనే  నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో చేతులారా తీసుకోవడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటి రోడ్డు ప్రమాదాలు ఎన్నో ప్రతిరోజు జరుగుతూ  కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి.  ఇలా రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయ్. ఇక్కడ రోడ్డు ప్రమాద దృశ్యాలు ఏకంగా ఒళ్లు గగుర్పాటు గురిచేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఏకంగా ప్రాణాలు కాపాడే ఆంబులెన్స్ ఇక్కడ కొంతమంది పాలిట యమపాశం గా మారిపోయింది అని చెప్పాలి. వ్యక్తి ప్రాణాలను కాపాడటానికి అతి వేగంగా దూసుకొచ్చిన అంబులెన్స్  చివరికి అదుపుతప్పి టోల్ ప్లాజాను ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రాణ   నష్టం కూడా ఎక్కువగానే జరిగింది. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. టోల్ బూతు లోని సీసీ కెమెరాల్లో నమోదైన ప్రమాద వీడియోని దుర్గాప్రసాద్ అనే వైద్యుడు ట్విట్టర్ వేదికగా పంచుకోవడంతో ఈ వీడియో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఈ వీడియోలో చూసుకుంటే సైరన్ మోగిస్తూ ఆంబులెన్స్ ఎంతో వేగంగా దూసుకొస్తోంది. గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది ఏదో ఎమర్జెన్సీ ఉందని భావించి అడ్డంగా పెట్టిన ప్లాస్టిక్ బారికేడ్లను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే టోల్ ప్లాజా వద్ద మరో బారికేడ్ ను తొలగించేందుకు అక్కడ ఉన్న ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే మితిమీరిన వేగం కారణంగా ఆంబులెన్స్ అదుపుతప్పింది. డ్రైవర్ ఒక్క సారిగా బ్రేక్ వేయడం.. అదే సమయంలో  రోడ్డుపై వర్షపు నీరు ఉండడంతో వాహనం అదుపు తప్పి ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన అంబులెన్స్ టోల్ బూత్ ను ఢీ కొట్టింది. ఇక ఈ ప్రమాదంలో బారికేడ్  తొలగిస్తున్న వ్యక్తి వాహనానికి బూత్ కి మధ్య నలిగిపోయాడు. అంబులెన్స్ వేగం దాటికి అందులో ఉన్న రోగి బంధువులు చెల్లాచెదురుగా పడిపోయారూ. ఈ ఘటనలో  ఒకరూ మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు అని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: