తిక్క కుదిరింది.. గేదె ముందు డాన్స్.. చివరికి?

praveen
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది. అధునాతనమైన నగరాల్లో జీవిస్తున్న వారితో  పాటు పాటు మారుమూల గ్రామాల్లో ఉండే వారికి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే అందరికీ సోషల్ మీడియా మీద అవగాహన రావడంతో గంటల తరబడి స్మార్ట్ ఫోన్ లోనే ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది అన్న విషయం తెలిసిందే. అంతే కాదు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా లో లైక్ ల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇక సోషల్ మీడియాలో ఏదో ఒకటి కొత్తగా ప్రయత్నించడం ఎక్కువ లైకులు పొంది ఫేమస్ కావాలని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.

 ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో కొంతమంది చేస్తున్న చిత్రవిచిత్రమైన ప్రయత్నాలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఏకంగా లైకుల కోసం ఇలాంటి పనులు కూడా చేస్తారా అని నెటిజన్లు అందరూ ఆశ్చర్య పోయే విధంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. అయితే ఏకంగా ప్రాణాలకు తెగించి మరీ సాహసాలు చేస్తూ ఉండటం  కూడా సోషల్ మీడియాలో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇప్పటి వరకు ఎంతో మంది నెటిజన్లు తాము ప్రేమగా పెంచుకునే కుక్కలు పిల్లలతో కలిసి డాన్స్ చేయడం ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి జరిగాయి.

 కానీ ఇక్కడ ఒక యువతి మాత్రం ఒక్క అడుగు ముందుకు వేసి కాస్త ధైర్యం చేసి వినూత్నంగా ప్రయత్నించింది. పెంపుడు జంతువులతో డాన్స్ చేస్తే లైకులు వస్తాయో లేదో అనుకుందో ఏమో వేగంగా ఒక గేదె దగ్గర డాన్స్ చేయాలని భావించింది. ఈ క్రమంలో ముందుగా గేదె కు మేత  వేస్తున్నట్లుగా నటించిన ఆ యువతి తర్వాత ఆ గేదె ముందు విచిత్రమైన డాన్స్ చేయడం మొదలుపెట్టింది. ఆ డాన్స్ పాపం గేదెకు నచ్చలేదనుకుంటా చిర్రెత్తుకొచ్చి ఒక్కసారిగా ఆమెకు షాక్ ఇచ్చింది. ఒక్క గుద్దు గుద్దింది. దాంతో ఆ యువతి వెళ్లి పక్కనే ఉన్న నీటి తొట్టిలో పడిపోయింది. ఎందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vir

సంబంధిత వార్తలు: