వైరల్ : ఇంట్లోకి దూరిన పాము.. ఏం చేస్తారో తెలిస్తే షాకే?

praveen
ఎలకల కోసం ఇల్లు కాలపెడతామా అని సామెత గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ ఇంట్లో ఎలుకలు ఉంటే వాటిని ఏదో ఒకరకంగా వెళ్ళగొట్టాలి. కాని వాటి కోసం ఇల్లును నాశనం చేసుకోలేము  కదా అంటూ దీనికి అర్థం వస్తుంది. అయితే జంతు ప్రేమికులకు అయితే ఈ సామెత పరిగణనలోకి రాదు అని చెప్పాలి. ఎందుకంటే ఏకంగా జంతువులు వన్యప్రాణుల ప్రాణాలను రక్షించేందుకు ఇల్లు ఏంటి ఏం చేయడానికైనా సిద్ధపడే పోతూ ఉంటారు జంతు ప్రేమికులు. మరి కొంత మంది మాత్రం ఇక ఇలా వన్యప్రాణులు కానీ ఏదైనా జంతువులతో  ఇబ్బంది ఏర్పడితే వాటిని చంపేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల హర్యానాలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

 హర్యానాలోని  సోహన ఏరియాలో ఏకంగా పాము కోసం ఇల్లుని కూల్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్లో వైరల్ గా మారిపోయింది. సోహానా ఏరియాలో రెండు ఇళ్లు పక్కన పక్కన కట్టి ఉన్నాయి. ఇక రెండు ఇల్లు గోడలు కూడా దాదాపు ఆనుకొని ఉన్నాయి అని చెప్పాలి. అయితే దురదృష్టవశాత్తు ఇటీవల ఈ రెండు గోడల మధ్య ఉన్న ఖాళీ ప్లేస్ లోకి దూరింది నాగుపాము. అయితే ఆ పామును ఎలాగోలా చంపాలని స్థానికులు అనుకోలేదు. ప్రాణాలను కాపాడాలని భావించారు.  వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ టీంకి ఈ విషయాన్ని తెలియజేశారు.

 అయితే ఇక ఈ టీం సభ్యులు అక్కడికి చేరుకుని పామును  బయటకు రప్పించాలని ప్రయత్నం చేశారు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పాము రెండు గోడల మధ్య నుంచి బయటకు రాలేదు. దీంతో ఇంటిపైకప్పు అలాగే గోడను కూల్చి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇంటి యజమాని నుంచి కూడా అనుమతి లభించింది. ఇంకేముంది నాగుపామును బ్రతికించడం కోసం ఏకంగా ఎంతో కష్టపడి కట్టుకున్న ఇంటి పైకప్పును గోడను కూల్చి వేశారు. చివరికి ఆ పాము బయటకు వచ్చింది.ఈ క్రమంలోనే ఎంతో చాకచక్యంగా ఆ నాగు పాము ని పట్టుకుని ఒక డబ్బాలో బంధించి అడవుల్లో వదిలేసారూ. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: