అతడి కౌగిలికి ఫుల్ డిమాండ్..ఎంతో తెలుసా?

Satvika
డబ్బు మీద వ్యామోహం తో బంధువులు, బందుత్వాలు అనేవి కనుమరుగయ్యాయి.కరోనా విడిచిన పరిస్థితుల తర్వాత నా అనే ఆప్యాయత పూర్తిగా కరువైంది.. ఆధునిక సమాజం లో బంధుత్వాల కు ప్రాధాన్యత తగ్గిపోయింది.. నా అనుకునేవారు కరువవుతున్నారు. కొందరికి స్నేహితులు కూడా ఉండరు.. వీరు ఎప్పుడూ ఒంటరి తనంలో ఉండి పోతున్నారు.
మానసికంగా కృంగిపోతుంటారు. వారి ఇబ్బందులు ఎవరికి చెప్పుకవాలో తెలియదు.. అలాంటి వారి సంఖ్య సమాజంలో రోజురోజుకు పెరిగిపోతోంది. బంధాలు, బంధుత్వాల కు విలువనిచ్చే భారత దేశం లో వీరి సంఖ్య చాలా తక్కువే. ఫారెన్ కంట్రీస్ లో వీరి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి వారికి ట్రెజర్ అనే వ్యక్తి నేనున్నానంటున్నాడు. ఒక్క గంట కౌగిలించుకొ ని వారి బాధను దూరంచేస్తున్నాడు.

ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ కు చెందిన 30 ఏళ్ల ట్రెజర్ అనే కౌగిలించు కోవటాన్నే వ్యాపారంగా మల్చుకున్నాడు. ట్రజెర్ రోబోటిక్స్‌ లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీర్. ప్రొడక్ట్, క్లయింట్ మేనేజర్‌ గా విభిన్న విభాగాల్లో ఉద్యోగం చేశాడు. ప్రస్తుతం అతని లక్ష్యం ఎవరూ లేరు అనుకొని మానసికంగా, ఒంటరి తనంతో బాధపడుతున్న వారికి ఆనందాన్ని ఇవ్వడమే. అదీ ఎలాగంటే కౌగిలించుకోవటం ద్వారా. గంటసేపు కౌగిలించుకొని వారి ఇబ్బందిని తీర్చితే గంటకు 75 ఫౌండ్లు (భారత కరెన్సీలో రూ. 7వేలు) చార్జ్ చేస్తాడు...

అతడిని సంప్రదించగానే ఇంటికి వచ్చి బాధితుడిని దగ్గరకు తీసుకుంటాడు. కౌగిలించుకొని వారు చెప్పింది వింటాడు. తల నిమురుతూ ఆందోళన తగ్గేలా చేస్తాడు. ఇందుకోసం అతడు గంటకు 7వేలు తీసుకుంటాడు. చిన్న వారి నుంచి ముసలివారి వరకు ఇలా ఆడ, మగ అనే తేడా లేకుండా ట్రెజర్ కోరుకున్న వారికి తన కౌగిలిని అందిస్తూ వారి ఒంటరి తనాన్ని దూరం చేస్తున్నాడు.. భలే ఉంది కదా.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: