ఇలాంటి ఆమ్లెట్ ను జీవితంలో చూసి ఉండరు.. దేవుడా..

Satvika
ఒక్కొక్కరిది ఒక్కో టేస్ట్ అన్న విషయం తెలిసిందే..కొన్ని రుచులు జనాలకు కోపం తెప్పిస్తె మరికొన్ని మాత్రం నవ్విస్తున్నాయి.అలాంటి వాటిలో ఫుడ్ కు సంభందించినవే ఎక్కువగా ఉన్నాయి..అందులో ఇప్పుడు వెరైటీ పేరుతో ఎన్నో వంటలు సోషల్ మీడియాలో చూస్తున్నాము..అలాంటి ఇప్పుడు ఒక వెరైటీ ఆమ్లెట్ దర్శన మిస్తుంది..అదేంటో ఒకసారి చూడండి.. రోజూ మనం చేసుకొనె వంటకాలు తిని విసుగొచ్చిందేమో ఇటీవల కొందరు వినూత్న వంటకాలు ప్రయత్నిస్తున్నారు. కొత్త కొత్త కాంబినేషన్లతో వెరైటీ విరెసిపీ


ప్రయత్నిస్తున్నారు.తయారుచేయడమే కాదు వాటి మేకింగ్‌ వీడియోలు, ఫొటోలను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. ఈ వెరైటీ వంటకాల్లో కొన్ని బాగుంటుంటే.. మరికొన్ని మాత్రం వికారం తెప్పిస్తున్నాయి. తాజాగా అలాంటి వెరైటీ వంటకం ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. గతంలో ఓ వీధి వ్యాపారి ఓరియో బిస్కెట్లతో బజ్జీలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే బిస్కట్లు, కూల్‌ డ్రింక్స్‌ తో కలిపి ఆమ్లెట్‌ను తయారుచేశాడు కోల్‌కతాకు చెందిన ఓ వీధి వ్యాపారి... ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోలో వీధి వ్యాపారి మొదట ప్యాన్‌పై కొంచెం నూనె బాగా మరిగిస్తాడు. ఆ తర్వాత ఓరియో బిస్కట్లను పొడి గా చేసి నూనె లో మిక్స్‌ చేస్తాడు. ఆ తర్వాత గిలక్కొట్టిన గుడ్ల మిశ్రమాన్ని కలుపుతాడు. ఆపై రెండు బ్రెడ్‌ స్లైస్‌లను తీసుకుని బ్రెడ్ ఆమ్లెట్‌ను తయారుచేస్తాడు. చివరిగా దానిపైకి తరిగిన ఉల్లిపాయలు, మిర్చీ, కొత్తిమీర, నిమ్మరసం తో పాటు మిగిలిపోయిన ఓరియో కుకీస్‌తో గార్నిషింగ్‌ టచ్‌ ఇచ్చి సర్వర్లకు అందిస్తున్నాడు. ఈ వెరైటీ రెసిపీ చూసిన నెటిజన్ల ను తెగ ఆశ్చర్యపోతున్నారు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన ఆహార ప్రేమికులు విస్తుపోతున్నారు. వాళ్ళకు ఇష్ట మైన కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు.. మీరు ఒకసారి చూడండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: