మావటివాడిని కాపడిన ఏనుగు..నిజంగా గ్రేట్ భయ్యా..

Satvika
దేశ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.గత వారం నుంచి భారీగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల నీటితో నిండిపోయాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనాలను నీటిలో ముంచెత్తుతున్నాయి... మనుషులు సురక్షితంగా ఉండటం చాలా కష్టం. వరదలో చిక్కుకున్న ఏనుగులను కాపాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాని బీహార్ లోని పాట్నా దగ్గర గంగానదిలో మాత్రం మావటిని కాపాడింది గజరాజు. పాట్నా సమీపం లోని రాఘవాపూర్ దగ్గర గంగానది లో ఏనుగు తో సహా చిక్కుకుపోయాడు మావటి.



ఏనుగును నది దాటించాలంటే పడవ అవసరం. అయితే అంత డబ్బు లేకపోవడంతో ఏనుగు తో నది దాటే ప్రయత్నం చేశాడు . అయితే ఆకస్మాత్తుగా నదిలో ప్రవాహం పెరిగింది. ఓ చెట్టు కు పట్టుకొని ఏనుగు మీద కూర్చున్నాడు మావటి.. కాసేపటి తరువాత మావటిని క్షేమం గా ఒడ్డుకు చేర్చింది ఆ ఏనుగు. విషయానికొస్తే.. బీహార్లోని వైశాలిలోని రాఘోపూర్లో ఏనుగు తన వీపుపై కూర్చొని గంగానదిని దాటారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



సడెన్ గా నిన్ ఒక్కసారిగా గంగానదిలో నీరు పెరగడంతో రాఘోపూర్ ప్రాంతం లో ఏనుగుతోపాటు మావటి కూడా చిక్కుకుపోయాడు. చివరికి ఏనుగుతో గంగను దాటాడు. కానీ ఉగ్రరూపం దాల్చిన గంగానది ఏనుగు మహౌట్తో అవతలి ఒడ్డుకు తీసుకొచ్చింది.రాఘోపూర్ నుంచి ఏనుగుతో మావటి పాట్నాకు బయల్దేరాడు. రుస్తంపూర్ వద్ద నది ఘాట్ నుంచి పాట్నా వైపు వెళ్లాలి. రుస్తంపూర్ ఘాట్ వద్దకు రాగానే పైపా వంతెన తెరిచినట్లు గుర్తించారు. ఒక్కసారిగా నీరు ఉప్పొంగడంతో ఇద్దరూ నదిలో చిక్కుకుపోయారు. ఏనుగుకు కాపలాగా ఉన్న మహౌట్ నదిని దాటాలని నిర్ణయించుకున్నాడు.అలా తన ప్రయత్నం ఫలించింది.

 ప్రాణాలతో బయట పడ్డాడు..పడవ లో వస్తున్న వారి సెల్ ఫోన్ లో ఈ వీడియోను బంధించారు.పెంచిన ప్రేమను చూపించింది..నిజంగా గ్రేట్ అంటూ కామెంట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: