వరుడికి బుద్ది చెప్పిన వధువు చెల్లెలు..వైరల్..

Satvika
ఏదైనా స్పెషల్ డే వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ పార్టీకి మందు, విందు ఉండాలి..అయితే తాగొద్దని ఎంత మొత్తుకున్నా కూడా జనాలు అస్సలు వినరు.ఎవరూ దారి వారిదే..సమాజంలో గౌరవానికి కూడా భంగం కలిగిస్తుందని పెద్దలు తరచూ చెబుతుంటారు. తాజాగా.. ఓ వివాహ వేడుకకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చేస్తోంది. ఇందులో వరుడు తాగి వేదిక మీదకు వెళతాడు. ఈ క్రమంలో జరిగిన సన్నివేశంతో అతని మరదలు చేసిన పనికి అంతా షాకవుతారు. సాధారణంగా.. మద్యపానానికి దూరంగా ఉండాలని పెద్దలు చెప్పినా.. చాలామంది పట్టించుకోరు.

ఇది ఇలా వుండగా..తాజాగా..బీహార్‌ మద్యపాన ప్రియుడు అంటూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. బీహార్‌లో మద్యపాన నిషేధం ఉన్నా.. ఎక్కడికక్కడ మద్యం విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. మద్యం సేవించిన తర్వాత చాలామంది స్పృహ కోల్పోవడం, తడబడటం, ఎక్కడో హఠాత్తుగా పడిపోవడం లాంటివి మీరు తప్పక చూసి ఉంటారు. కానీ ఇక్కడ వరుడు ఫుల్లుగా తాగి.. పెళ్లి వేదిక మీదకు వెళ్లాడు. అప్పుడు జరిగిన సన్నివేశం అందరిని ఆశ్చర్యానికి గురిచేయడంతోపాటు కడుపుబ్బా నవ్విస్తుంది.

మద్యం తాగి వివాహ వేదిక మీదకు వెళ్లిన వరుడు ఎలా ఊగిపోతున్నాడో చూడవచ్చు. అతన్ని అతని స్నేహితుడు పట్టుకున్నాడు.. లేకపోతే పడిపోయేవాడు. ఈ క్రమంలో పెళ్లికూతురు సోదరి వరమాలలను తీసుకోని వస్తుంది. వధువు దండను తీసుకోని వరుడి మెడలో వేస్తుంది. కానీ వరుడు దండను పట్టుకొని తూలుతుంటాడు. మత్తులో ఉన్న వరుడు జయమాలను వధువు చెల్లెలికి వేస్తాడు. దీంతో ఆమె కోపంతో చెంపదెబ్బల వర్షం కురిపిస్తుంది. అయితే.. వరుడు మత్తులో ఉండటంతో పట్టించుకోడు. చివరకు ఆమె అరవడంతో దండను తీసి పట్టుకుంటాడు..చివరికి ఆమెకు కోపం రావడం తో పల్లున పీకుతుంది..అది కాస్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: