వైరల్ వీడియో : కారును ఢీ కొట్టిన చిరుత.. తర్వాత?

praveen
జాతీయ రహదారుల వెంట కొన్ని కొన్ని సార్లు రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి రోడ్డు ప్రమాదాలలో అడవి జంతువులు చివరికి మృత్యువాత పడుతు ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా ఇటీవలి కాలంలో అయితే తరచూ చిరుత పులులు ఇక జాతీయ రహదారుల పైకి  వస్తూ ఉండటం ద్వారా వేగంగా వస్తున్న వాహనాలు చిరుత పులులను ఢీకొనడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలలో ఎన్నో చిరుతపులులు మృతి చెందుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. చిరుత పులి ని కారు ఢీ కొట్టిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది.

 జాతీయ రహదారిపై కారు ఎంతో వేగంగా వస్తున్న సమయంలో అకస్మాత్తుగా అక్కడికి ఒక చిరుత అడ్డుగా వచ్చింది.  దీంతో కారు నడుపుతున్న వ్యక్తి బ్రేక్ వేసినప్పటికీ కూడా అప్పటికి కారు చిరుతపై దూసుకుపోయింది. దీంతో ఇక చిరుత గాయాలు కావడంతో కార్ కింద నుంచి బయటకు రాలేక పోయింది.  ఆ తర్వాత సదరు వ్యక్తికి కారు రివర్స్ చేసి కాస్త వెనక్కి వెళ్లడంతో చివరికి చిరుత కారు కింద నుంచి లేచి తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక ఈ ప్రమాదంలో కారు ముందు భాగం కూడా దెబ్బతింది అన్న విషయం తెలుస్తుంది.

 అయితే అక్కడ జరుగుతుంది అంతా పక్కనే ఉన్న మరో వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డు చేసి ఇక ట్విట్టర్లో పోస్టు చేయడంతో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఇక ఈ వీడియోను చూసిన నటి రవీనా టాండన్ తన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. అందమైన చిరుత తీవ్రంగా గాయపడినా.. వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఇక మన రాజకీయ నాయకులు వన్యప్రాణుల సంరక్షణ దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు అని ఆశిస్తున్నాను అంటూ కామెంట్ చేశారు  రవీనాటాండన్. ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో మంది నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వన్యప్రాణులకు ఏమాత్రం సురక్షితం కాని రహదారులను మనం నిర్మించుకుంటున్నాం అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: