స్నేక్ మ్యాన్ : ఇతని పరిస్థితి తెలిస్తే కన్నీళ్లు ఆగవు!

Purushottham Vinay
ఇక 25 ఏళ్ల మజిబర్ రెహ్మాన్ మాలిక్ అనే ఈ యువకుడు ఎరిత్రోడెర్మా(erythroderma) అనే ప్రాణాంతక చర్మ వ్యాధితో బాధపడుతున్నాడు. దీనివల్ల అతడి చర్మం వాచిపోతూ బాగా పొట్టుగా రాలిపోతుంటుంది. ఫలితంగా చర్మం కూడా ఎర్రగా కమిలిపోతుంది. ఇక ఈ పరిస్థితిని 'రెడ్ మ్యాన్ సిండ్రోమ్' అని కూడా పిలుస్తుంటారు. మాలిక్‌కు పుట్టక నుంచే ఈ భయంకర సమస్య మొదలైంది. ప్రతివారం అతడు పాము కుబుసం విడుస్తున్నట్లుగా చర్మాన్ని వదులుతాడు. ఇక చలికాలం వచ్చిందంటే చాలు పాపం అతనికి మరింత నరకం. అతడ చర్మం పొడిగా మారిపోయి ఇక చిట్లిపోతుంది.స్థానికంగా ఎన్నో హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ కోసం అతను ప్రయత్నించాడు. అయితే, ప్రతి డాక్టర్ కూడా ఒకటే మాట చెప్పారు. ''ఇక ఇక్కడి ఆసుపత్రుల్లో నీ సమస్యకు ట్రీట్మెంట్ లేదు. ఖచ్చితంగా పెద్ద ఆసుపత్రులకు వెళ్లు'' అని సూచించేవారు. కానీ, ఆర్థిక సమస్యల వల్ల అతడు ఇంకా అతడి కుటుంబం ఆ ప్రయత్నం చేయలేదు. అలాగే మాలిక్‌కు స్కూల్‌కు వెళ్లడమంటే చాలా ఇష్టం. అయితే, అతడి రూపాన్ని చూసి స్కూల్ పిల్లలు బాగా భయపడుతున్నారనే కారణంతో చదువుకు కూడా దూరమయ్యాడు.


అయితే, తనకు ఉన్న ఈ సమస్య గురించి ఎక్కువగా ఆలోచిస్తూ బాధతో కుమిలిపోవడం మాలిక్‌కు అసలు ఇష్టం లేదు.అందుకే ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చేస్తూ తన పరిస్థితి గురించి ఇతరులకు వివరిస్తున్నాడు. ఈ చర్మ సమస్య వల్ల మాలిక్ కళ్లు చాలా ఎర్రగా మారిపోయాయి. అలాగే ఒక కంటికి చూపు కూడా పోయింది.అలాగే ఇంకో కన్ను కూడా క్రమేనా చూపును కోల్పోతున్నట్లు మాలిక్ చెప్పాడు. ''ఈ నా సమస్యను నేను బలంగా మార్చుకున్నాను. మీకు ఏమైనా సమస్య ఉంటే అసలు కుమిలిపోకూడదు. ఇతరులు ఏమనుకుంటున్నారనేది నేను అసలు పట్టించుకోను. నా కుటుంబం ఇంకా నా స్నేహితులు నాకు తోడుగా ఉన్నారు. కాబట్టి, నేను హ్యాపీగానే ఉన్నాను'' అని మాలిక్ తెలిపాడు. అయితే, ఇక మాలిక్‌కు చికిత్స సాధ్యం కాదా? చర్మ వ్యాధి నిపుణులు అతడి సమస్యను ఇక పరిష్కరించలేరా? ఆరోగ్య నిపుణులు ముందుకొచ్చి..బాగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న ఈ యువకుడిని ఆదుకోవాలని దేవుణ్ణి కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: