ఆఫీసుకి నిమిషం లేటైతే 10 నిమిషాలు అదనపు వర్క్ చెయ్యాలి!

Purushottham Vinay
ఇక గుర్తు తెలియని కంపెనీకి సంబంధించిన ఓ షాకింగ్‌ సర్క్యూలర్ నెట్టింట వైరల్ అవుతూ చక్కర్లు కొడుతోంది. ఆ సదరు నోటీసులో ఏముందంటే' ఆఫీస్‌కు ఆలస్యంగా వస్తే ప్రతి నిమిషానికి కూడా ఖచ్చితంగా 10 నిమిషాల చొప్పున అదనంగా వర్క్‌ చేయవల్సి ఉంటుంది. ఇక ఆఫీస్‌కు వచ్చిన వెంటనే ఆఫీస్‌ బులెటన్‌ బోర్డులో కొత్త ఆఫీస్‌ రూల్స్‌కు సంబంధించిన సర్క్యులర్‌ను మీరు చదవవచ్చు..' అనేది సారాంశం. అంటే ఉదయం పూట 10 గంటల తర్వాత 2 నిముషాలు (2 నిముషాలు ఆలస్యానికి) ఆలస్యంగా వస్తే.. సాయంత్రం 6 గంటల తర్వాత (ఆలస్యంగా వచ్చినందుకు) నిముషానికి 10 నిముషాలు చొప్పున మొత్తం ఏకంగా 20 నిముషాలు అదనంగా వర్క్‌ చేయాలన్నమాట.ఇక అభిషేక్‌ అస్థానా అనే యూజర్‌ దీనిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఐతే ఏ కంపెనీకి సంబంధించినది అనే విషయం మత్రం ఇంకా తెలియరాలేదు.న్యూ ఆఫీస్‌ రూల్స్‌ పేరిట వెలువడిన ఈ నోటీసు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతూ హాట్‌ టాపిక్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కూడా చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే.. మరికొందరేమో బాగా జోకులు పేలుస్తున్నారు. కొన్ని కంపెనీ యాజమన్యాలు అయితే పని రాక్షసుల్లా ప్రవర్తిస్తుంటారు.


కానీ ఈ విధమైన విష పూరితనిర్ణయాలు అనతికాలంలోనే ఆ కంపెనీ నాశనానికి దారితీస్తాయని ఒకరు, ఇంకా ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడంవల్లనే దేశ కంపెనీల్లో అట్రిషన్‌ (వలసలు) రేటు అమాంతంగా పెరుగుతుందని మరొకరు ఇంకా ఉద్యోగుల పట్ల భారత కంపెనీల ప్రవర్తన ఏవిధంగా ఉందో ఈ నోటీసు తెల్పుతుందని ఇంకొకరు తమ కామెంట్ల రూపంలో స్పందించారు. అయితే ఇంకొందరేమో కంపెనీ ఉద్యోగుల్లో క్రమశిక్షణ రావాలంటే ఈ మాత్రం డోసు ఉండాల్సిందేనంటూ చాలా వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు. ఈ విధమైన రూల్స్‌ మీరు పనిచేస్తున్న కంపెనీలో పెడితే మీరెలా ఫీల్‌ అవుతారో అనేది ఇక కింద కామెంట్ల రూపంలో తెల్పండి.ఇంకా కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు అయితే ఆఫీస్ పాలసీని విషపూరితం అని ఇంకా అలాగే భారతీయ కంపెనీలలో అధిక అట్రిషన్ రేటుకు కారణమని వారు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: